ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mass Copying: నాగార్జున వర్సిటీ డిగ్రీ పరీక్షలో మాస్ కాపీయింగ్.. బయటపెట్టిన ఏబీఎన్

ABN, First Publish Date - 2023-08-23T16:03:10+05:30

నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది.

తిరుపతి: నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. తిరుపతిలోని ఆర్‌సీరెడ్డి డిగ్రీ కాలేజీలో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షల్లో పుస్తకాలు, మొబైల్ ఫోన్లు పెట్టుకుని మరీ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఇది తప్పు అని చెప్పాల్సిన యూనివర్సిటీ అబ్బర్వర్‌లు కూడా కాపీయింగ్‌కు సహకరిస్తున్న పరిస్థితి. కాగా మాస్‌ కాపీయింగ్‌‌పై కొందరు విద్యార్థులు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఏబీఎన్ బృందం పరీక్షా కేంద్రానికి వెళ్లి.. అక్కడ జరుగుతున్న కాపీయింగ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కాపీయింగ్‌పై మొదట బుకాయించేందుకు యత్నించిన కళాశాల ప్రిన్సిపల్ ద్వారక నాథ్ రెడ్డి ఆ తర్వాత అంగీకరించక తప్పలేదు. అన్ని పరీక్షా కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరిగి మానిటరింగ్ జరిగితే ఇలాంటి కాపీ ఉండదని ప్రిన్సిపల్ ద్వారక నాథ్ రెడ్డి అంగీకరించారు.

Updated Date - 2023-08-23T16:03:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising