Chandrababu Naidu: జనవరి 5 నుంచి చంద్రబాబు బహిరంగ సభలు.. షెడ్యూల్ వివరాలివిగో!
ABN, Publish Date - Dec 28 , 2023 | 07:23 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల నగారా మోగించేశాయి. ఓటర్లను ఆకర్షించడం కోసం ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి..
Chandrababu Public Meeting Schedule: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల నగారా మోగించేశాయి. ఓటర్లను ఆకర్షించడం కోసం ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జనవరి 5వ తేదీ నుంచి ఆయన ఈ బహిరంగ సభలకు శెళ్లనున్నారు. ప్రస్తుతం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కో రోజు ఒక బహిరంగ సభ, మరొక రోజు రెండు బహిరంగ సభలు నిర్వహించేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు.
ఒకసారి షెడ్యూల్ వివరాలు చూస్తే..
* జనవరి 5న ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో భారీ బహిరంగ సభ
* జనవరి 7న విజయవాడ పార్లమెంట్ తిరువూరు, నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంటలో బహిరంగ సభలు
* జనవరి 9న తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం, నంద్యాల పార్లమెంట్ ఆళ్లగడ్డలో బహిరంగ సభలు
* జనవరి 10న కాకినాడ పార్లమెంటు పరిధిలోని పెద్దాపురం, శ్రీకాకుళం పార్లమెంటు టెక్కలి నియోజకవర్గంలో బహిరంగ సభ
ఇంకా ఏయే ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలన్న విషయంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. జనవరి 29వ తేదీ కల్లా 25 సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలో జరిగే సభలకు లక్ష మంది హాజరయ్యేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా.. వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలకు పలు హామీలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన నష్టాలు, పెరిగిన అప్పులు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను హైలైట్ చేయనున్నారని సమాచారం. అయితే.. ఈ సభల్లో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కూడా భాగం అవుతారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Updated Date - Dec 28 , 2023 | 07:23 PM