ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: కుప్పంలో రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చ

ABN, First Publish Date - 2023-12-13T18:04:07+05:30

మూడు నెలల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు టీడీపీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

అమరావతి: దాదాపు మూడు నెలల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గం నాయకులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కుప్పంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని అధినేతకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వివరించారు. కుప్పంలో లక్ష మెజార్టీ దిశగా పని చేయాలని నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

కాగా.. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వేరే కేసులో ఉన్నారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదులు విన్న న్యాయస్థానం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Updated Date - 2023-12-13T18:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising