ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu : చంద్రబాబుకు అల్పాహారంగా నేడు ఇంటి నుంచి ఏం వెళ్లిందంటే..

ABN, First Publish Date - 2023-09-11T09:58:03+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్పాహారంగా సిబ్బంది నేడు ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లింది. చంద్రబాబు కు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో ఫ్రూట్ సలాడ్‌ను కుటుంబ సభ్యులు అల్పాహారంగా పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లిన సిబ్బంది.

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్పాహారంగా సిబ్బంది నేడు ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లింది. చంద్రబాబు కు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో ఫ్రూట్ సలాడ్‌ను కుటుంబ సభ్యులు అల్పాహారంగా పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లిన సిబ్బంది. హోరాహోరీ వాదనలు... తీవ్ర ఉత్కంఠ! రిమాండ్‌కు పంపిస్తారా? లేక... తిరస్కరిస్తారా? అనే హైటెన్షన్‌! చివరికి... తీర్పు వెలువడింది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయనకు ఇంటి వద్ద నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించింది. ప్రత్యేక వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్నందున ప్రత్యేక గది కేటాయించి, ప్రత్యేక భద్రత కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ప్రశ్నించేందుకు వీలుగా చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. చంద్రబాబుకు రిమాండ్‌ ఖైదీ నెంబరు 7691 కేటాయించారు. సెంట్రల్‌ జైలులోని ‘స్నేహ’ బ్లాక్‌ను చంద్రబాబు కోసం కేటాయించారు. బ్లాక్‌ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్యూటీ సిబ్బంది మినహా ఎవరినీ అటువైపు వెళ్లనీయడం లేదు.

Updated Date - 2023-09-11T10:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising