ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvagalam Navasakam: వైసీపీ అరాచకాలు కొనసాగితే.. ప్రపంచ పటంలో ఏపీ ఉండదు: బాలకృష్ణ

ABN, Publish Date - Dec 20 , 2023 | 06:58 PM

వైసీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటంలో ఏపీ ఉండదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. యువగళం నవశకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

విజయనగరం: వైసీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటంలో ఏపీ ఉండదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. యువగళం నవశకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లోకేశ్‌ యువగళం.. ప్రజాగళంగా కదంతొక్కిందన్నారు. పాదయాత్రలో బాధిత ప్రజందరినీ లోకేశ్ ఓదార్చారని చెప్పారు. లోకేశ్‌ పాదయాత్రకు వైసీపీ అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. వైసీపీ అక్రమాలకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పవన్‌ కల్యాణ్ పోరాడుతున్నారని కొనియాడారు. సీఎం జగన్.. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్‌ మార్చారన్నాని తెలిపారు.

పోలవరాన్ని పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వమని బాలకృష్ణ ధ్వజమెత్తారు. డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారని ఎద్దేవాచేశారు. వైసీపీ నేతలు శాండ్‌, ల్యాండ్‌ స్కామ్‌లతో కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతుల ఉద్యమాన్ని అణిచివేస్తున్నారని, రాజధాని కోసం పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - Dec 20 , 2023 | 07:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising