ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీలు చెప్పిన విషయాలు ఇవే

ABN, First Publish Date - 2023-02-01T16:57:13+05:30

ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామ‌న్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీలు ఎంపీ మిథున్‌రెడ్డి (MP Midhun Reddy), మోపిదేవి వెంకటరమణ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామ‌న్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీలు ఎంపీ మిథున్‌రెడ్డి (MP Midhun Reddy), మోపిదేవి వెంకటరమణ స్పందించారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ... విభజన హామీల పరంగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల నిధులపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అన్ని అంశాలపై నిలదీస్తామని ఎంపీ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం రాజకీయ ఆరోపణ అని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య సంభాషణను ఒకరు రికార్డు చేస్తే ట్యాపింగ్ ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. అలాగే బడ్జెట్‌పై ఎంపీ మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata ramana) మాట్లాడుతూ... నిధులు కేటాయింపు ఏదీ? అని ప్రశ్నించారు. ‘‘పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీని అనేక సార్లు సీఎం కోరారు. చంద్రబాబు (Chandrababu) స్వార్థంతో పోలవరం తాకట్టు పెట్టారు. ఫిషరీస్ సెక్టార్‌ను సీఎం (CM) అభివృద్ధి చేస్తున్నారు. ఆక్వా విషయంలో కేంద్రం ఇంకా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 6 లక్షల మందికి సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తికి నిధులు కేటాయింపులు చేయాలి’’ అని మోపిదేవి కోరారు.

Updated Date - 2023-02-01T16:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising