ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: మరోసారి ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఆగ్రహం.. ఎందుకంటే..?

ABN, First Publish Date - 2023-02-13T19:11:13+05:30

కొందరు ఎమ్మెల్యే (MLAs)ల పనితీరుపై సీఎం జగన్ రెడ్డి (CM Jagan) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 మంది వరకు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని సీఎం మండిపడినట్లు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కొందరు ఎమ్మెల్యే (MLAs)ల పనితీరుపై సీఎం జగన్ రెడ్డి (CM Jagan) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 మంది వరకు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని సీఎం మండిపడినట్లు తెలిసింది. ఆ నియోజకవర్గాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని జగన్‌ చెప్పినట్లు సమాచారం. కాగా ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై సీఎం జగన్‌ నేతృత్వంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనని కొందరు ఎమ్మెల్యేలపై సీఎం జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసలు తిరగనివారు, తక్కువరోజులు తిరిగినవారికి సీఎం క్లాస్‌ పీకారట. కొడాలి నాని, ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్ గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని సీఎం జగన్‌ పేర్కొన్నట్టు సమాచారం. ఇక కొందరు ఎమ్మెల్యేలు 3, 4 రోజులకే పరిమితమయ్యారని మండిపడ్డట్టు తెలుస్తోంది. ఇక మార్చ్‌ 18 నుంచి 'మా భవిష్యత్‌ నువ్వే జగన్' కార్యక్రమం జరగనుంది. ఈలోగా కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు.

ఎమ్మెల్యేలపై సీఎం ప్రత్యేక ఫోకస్

కాగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా వేగం పెంచారు. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేల పని తీరు పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రజలతో మమేకం అయ్యేలా ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. నియోజకవర్గాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు.. ఎమ్మెల్యేల పని తీరు ప్రాతిపదికగా సర్వే నివేదికలు అందుతున్నాయి. గెలిచే వారికే టికెట్లు అని ఇప్పటికే స్పష్టం చేశారు. పనితీరు మెరుగు పర్చుకోవాల్సిన వారికి హెచ్చరికలు కూడా చేశారు.

Updated Date - 2023-02-13T19:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising