ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kinjarapu Atchannaidu: జగన్‌కి దమ్ము ధైర్యం ఉంటే..: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2023-06-10T16:18:02+05:30

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో 74% పోలవరం పూర్తయిందని టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో 74% పోలవరం పూర్తయిందని టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. టీడీపీ నాయకులు పోలవరం (Polavaram) వెళ్తే వైసీపీ (YCP) బండారం బయటపడుతుందని అడ్డుకున్నారని మండిపడ్డారు. టీడీపీ హయంలోనే సాధారణ ప్రజలను ఆర్టీసీ బస్సుల్లో తీసుకువెళ్లి పోలవరం చూపించామని గుర్తుచేశారు. తమ పార్టీ నాయకులు పోలవరం దగ్గరికి వెళ్తే జగన్‌కి ఎందుకు అంత భయమన్నారు.

జగన్‌ (CM Jagan)కి దమ్ము ధైర్యం ఉంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పోలవరం చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అవినీతికి పోలవరం ఆహుతైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం కచ్చితంగా వెళ్తాం.. జగన్ అవినీతిని బయటపెడతామన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్ అబద్దాలకోరని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ఒక్క అవకాశం అని చెప్పి నాలుగు సంవత్సరాల్లో నాలుగు లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీదారుల అవినీతిని బయటపెడతామని వ్యాఖ్యానించారు. దోపిడీ సొమ్మును పేదవారికి పంచడమే టీడీపీ ప్రధాన ధ్యేయమన్నారు.

Updated Date - 2023-06-10T16:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising