CM Jagan: ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ABN, First Publish Date - 2023-02-08T21:10:10+05:30
కర్నూలులో రెండో లా వర్సిటీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి: కర్నూలులో రెండో లా వర్సిటీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా తాడేపల్లిగూడెంలో రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్డివిజన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. 500 మె.వా. అదానీ హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్కు 406 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే చిత్తూరు డైయిరీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.106 కోట్ల రుణాలు మాఫీకి ఆమోదం తెలిపింది. ఒంగోలు మండలాన్ని రూరల్, అర్బన్గా విభజనకు ఆమోదం తెలపగా.. 6 జిల్లా కేంద్రాల మండలాలను గ్రామీణ, అర్బన్గా విభజనకు అంగీకారం తెలిపింది.
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు (New Energy Park) ఏర్పాటుకు ప్రభుత్వం (AP Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడికి అంగీకారం తెలిపింది. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెట్టనుంది. ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ , సోలార్ పవర్ ప్రాజెక్ట్ (Wind and Solar Power Projects)లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా... 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
వైజాగ్ టెక్ పార్కు (Vizag Tech Park)కు 60 ఎకరాలు కేటాయించడంతో పాటు, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బందరు పోర్టు (Bandaru Port)కు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. 9.75 శాతం వడ్డీతో రూ. 3940 కోట్ల రుణం తీసుకోనుంది. అటు నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందు (Nellore Barrage to be renamed as Nallapureddy Srinivasulu Reddy Barrage)కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు అంగీకారం తెలిపిన కేబినెట్... యూనిట్‌కు రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది
Updated Date - 2023-02-08T21:12:35+05:30 IST