ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Highcourt: జీవో నెంబర్ 1411, 344 పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

ABN, First Publish Date - 2023-10-30T14:49:44+05:30

జీవో నంబర్ 1411, 344ను సవాలు చేస్తూ టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్స్‌పై విచారణ వాయిదా వేసింది.

అమరావతి: జీవో నంబర్ 1411, 344ను సవాలు చేస్తూ టీడీపీ నేతలు (TDP Leader) దాఖలు చేసిన పిటిషన్స్‌పై విచారణ హైకోర్టులో(AP Highcourt) వాయిదా వేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటును సవాలు చేస్తూ పిటిషన్స్ దాఖలయ్యాయి. అమరావతి భూములు వ్యవహారం, ఫైబర్ నెట్ స్కాంతో పాటు గత ప్రభుత్వ నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్ట్స్ సమీక్షకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 1411 జీవో జారీ చేసింది. అలాగే మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తుకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ మరో జీవో 344 వచ్చింది. ఈ రెండూ జీవోలను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య (Varla Ramaiah), ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు (Alapati Rajendraprasad) హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టులో విచారణకు వచ్చింది. తదుపరి విచారణను వచ్చేనెల 16కు వాయిదా వేసింది.

Updated Date - 2023-10-30T14:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising