ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala: బ్రహ్మోత్సవాల సందర్భంగా శుభవార్త.. భక్తులకు 24వేల ఉచిత టిక్కెట్లు

ABN, First Publish Date - 2023-09-16T21:12:43+05:30

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో 1.30 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు టీటీడీ అందించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమలలో ఈనెల 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఈనెల 17న రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అంకురార్పణం జరగనుంది. సాయంత్రం 6.15 గంటల నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ధ్వజారోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 18న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఇది కూడా చదవండి: India Lockdown: దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్.. ఎందుకంటే..?

కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు తిరుమలలో సీనియర్ సిటిజన్ దర్శనాలు, చంటిబిడ్డల దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫారసు లేఖల ద్వారా దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. మాడ వీధుల్లో రంగవల్లులను టీటీడీ తీర్చిదిద్దామని.. గ్యాలరీల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో 1.30 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు టీటీడీ అందించనున్నట్లు తెలిపారు. 2 లక్షల మంది భక్తులు వీక్షించేలా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశామన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 22న గరుడ సేవ కారణంగా తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశామని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ ఈవో కోరారు.

Updated Date - 2023-09-16T21:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising