ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telugu titans: శారదా విద్యాలయ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న తెలుగు టైటాన్స్‌

ABN, First Publish Date - 2022-12-01T19:34:30+05:30

కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్న శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్న శారదా విద్యాలయ (Sharada Vidyalaya) శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌)లోని తెలుగు టైటాన్స్‌ (Telugu titans) జట్టు శారదా విద్యాలయంను సందర్శించింది. విద్యార్థులతో ముచ్చటించిన క్రీడాకారులు విద్యార్థులకు కబడ్డీ మెళకువలనూ చెప్పారు. విద్యలో క్రీడలు ఓ భాగం చేసుకోవాలని క్రీడాకారులు కోరారు. పట్టుదల, ఏకాగ్రత, వ్యూహరచన వంటివి కబడ్డీ లాంటి క్రీడలతో మెరుగవుతాయన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన విద్యాసంస్థను సందర్శించడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ జయంత్‌ ఠాగోర్‌, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్‌ మాదిరెడ్డి, కరస్పాండెంట్‌ జ్యోత్స్నఅంగారా సైతం పాల్గొన్నారు.

నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో శారదా విద్యాలయ గ్రూప్‌ను 1922లో శ్రీ వై సత్యనారాయణ ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయను అప్పటి హైదరాబాద్‌ నిజాం, ప్రధానమంత్రితో పాటుగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అత్యంత పురాతనమైన, లాభాపేక్షలేని విద్యాలయంగా ఖ్యాతి గడించిన శారదా విద్యాలయలో కెజీ నుంచి పీజీ వరకూ విద్యాబోధన సాగుతుంది. దాదాపు 1450 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత బాలికల కోసమే దీనిని ప్రారంభించినా అనంతర కాలంలో బాలురకీ ఇక్కడ విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలో 62శాతం మంది బాలికలు ఉన్నారు. నిరుపేద చిన్నారులకు విద్యనందించడంలో అందిస్తున్న తోడ్పాటుకుగానూ 2018లో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డునూ అందుకుంది. అవిశ్రాంతంగా వందేళ్లగా మెరుగైన విద్యాబోధనను పాతబస్తీ విద్యార్థులకు చేస్తోన్న శారదా విద్యాలయ విప్లవాత్మక ఆవిష్కరణలనూ మెరుగైన విద్య కోసం చేసింది. డిజిటల్‌ తరగతులను నాల్గవ తరగతిలోపు విద్యార్థులకు తీసుకురావడంతో పాటుగా 1.36 ఎకరాల విస్తీర్ణంలో ఆటస్థలాన్నీ విద్యార్థులకు అందుబాటులో ఉంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కూ అమిత ప్రాధాన్యత అందిస్తుంది.

Updated Date - 2022-12-01T19:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising