ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సంచలన రికార్డు!

ABN, First Publish Date - 2022-11-06T17:59:04+05:30

టీమిండియా (team india) స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (suryakumar yadav) ఖాతాలోకి అత్యంత అరుదైన ఘనత వచ్చి చేరింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: టీమిండియా (team india) స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (suryakumar yadav) ఖాతాలోకి అత్యంత అరుదైన ఘనత వచ్చి చేరింది. తాజాగా, జింబాబ్వే (zimbabwe)తో జరిగిన మ్యాచ్‌లో సూర్య విరుచుకుపడ్డాడు. 244 స్ట్రైక్ రేట్‌తో 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. రోహిత్ శర్మ, కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తించి జట్టు భారీ స్కోరు సాధించడంలో సాయపడ్డాడు.

సూర్యకుమార్ 28 మ్యాచుల్లో 28 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 1026 పరుగులున్నాయి. ఈ ఏడాది సూర్య తర్వాతి స్థానాల్లో మహ్మద్ రిజ్వాన్ (924), విరాట్ కోహ్లీ (731), పాథుమ్ నిశ్శంక (713), సికందర్ రజా (701) ఉన్నారు.

ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఓవరాల్‌గా సూర్యది రెండో స్థానం. ఈ జాబితాలో పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రిజ్వాన్ రికార్డులకెక్కాడు. రిజ్వాన్ గతేడాది 29 మ్యాచుల్లో 1326 పరుగులు సాధించాడు. ఇందులో 12 అర్ధ సెంచరీలున్నాయి.

సూర్యకుమార్ గతేడాది మార్చిలో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లు ఆడిన 32 ఏళ్ల సూర్య 42.23 సగటుతో 1270 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 225 పరుగులతో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. 246 పరుగులతో కోహ్లీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

నెదర్లాండ్స్(netheralands) చేతిలో దక్షిణాఫ్రికా (south africa) అనూహ్యంగా ఓటమి పాలుకావడంతోనే భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన పాకిస్థాన్ కూడా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అప్పటికే సెమీస్‌కు చేరిన భారత జట్టు ఈ విజయంతో గ్రూప్-2లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

Updated Date - 2022-11-06T18:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising