ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు పక్కన ఫొటోలు దిగుతున్న ఇద్దరు కుర్రాళ్లు.. యజమాని చూసి ఏం చేశాడో అస్సలు ఊహించలేరు..!

ABN, First Publish Date - 2022-12-21T16:59:11+05:30

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో యువకులు.. ప్రతి చిన్న సంఘటనను కూడా సెల్ఫీలు, వీడియోల రూపంలో భద్రపరుచుకుంటున్నారు. కొందరు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. లైకులు, వ్యూస్‌ను చూసి సంబరపడిపోవడం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ (Smart phone) యుగంలో యువకులు.. ప్రతి చిన్న సంఘటనను కూడా సెల్ఫీలు, వీడియోల (Selfies videos) రూపంలో భద్రపరుచుకుంటున్నారు. కొందరు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. లైకులు, వ్యూస్‌ను చూసి సంబరపడిపోవడం సర్వసాధారణమైంది. కొందరు ఇంకాస్త గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద వాహనాలు, భవనాల వద్ద పదే పదే సెల్ఫీలు తీసుకోవడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ యువకుడు ఇలాగే ఓ కారుపై మనసు పడ్డాడు. ఇంకేముందీ స్నేహితుడిని పిలిచి.. వీడియోలు, ఫోటోలు తీయమని చెప్పాడు. తీరా కారు పక్కన ఫొటోలు దిగుతుండగా.. యజమాని చూసి ఏం చేశాడంటే...

Income Tax: కూలీకి షాకిచ్చిన ఐటీ శాఖ.. రూ.14 కోట్ల ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు..!

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఇద్దరు యువకులు ఓ కారు వద్ద ఫొటోలు దిగుతుంటారు. ఓ యువకుడు కారు పక్కన నిల్చుని ఉండగా.. మరో యువకుడు ఫొటో తీస్తూ ఉంటాడు. అయితే కారు యజమాని వీరింద్దరిని ఇంటి పైనుంచి గమనిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత బయటికి వచ్చి పైనుంచి యువకుడిని పిలుస్తాడు. దీంతో సదరు యువకులు భయపడిపోతారు. అయితే పైనుంచి కిందకు వచ్చిన కారు యజమాని.. వారిని ఏం కావాలని అడుగుతాడు. అందుకు ‘‘మీ కారు నాకు ఎంతో ఇష్టం.. చాలా రోజులుగా చూస్తూ ఉన్నా.. ఫొటో దిగాలని కోరికతో ఇలా చేశా’’.. అని చెబుతాడు. అందుకు సమాధానంగా కారు యజమాని అతడికి మరింత ఆనందాన్ని కలిగిస్తాడు. ఏకంగా కారు తాళాలు ఇచ్చి కారులో కూర్చుని ఫొటోలు దిగమని ఆఫర్ ఇస్తాడు. దీంతో సదరు యువకుడు తెగ సంబరపడిపోతాడు. తర్వాత కారు నుంచి దిగుతూ వీడియోలు, ఫొటోలకు ఫోజులిస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కారు యజమాని మంచితనాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

Viral Video: బస్సును వెనుక నుంచి ఫాలో అయిన వ్యాన్ డ్రైవర్.. బస్సు తోలుతూ డ్రైవర్ చేస్తున్న పని చూసి..

Updated Date - 2022-12-21T17:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising