ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాటికి కాళ్లు చాపే వయసులో జిమ్మాస్టర్‌గా ఘనత.. త్వరలో మిస్టర్ ఆసియా పోటీల్లో పాల్గొంటున్న ఆ 72 ఏళ్ల వ్యక్తి ఎవరో తెలుసా..

ABN, First Publish Date - 2022-06-24T21:58:04+05:30

కండల వీరుడిగా అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 40ఏళ్లు వచ్చేసరికే చాలా మంది వివిధ అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే....

రత్నం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కండల వీరుడిగా అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 40ఏళ్లు వచ్చేసరికే చాలా మంది వివిధ అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 72ఏళ్ల వ్యక్తిని.. వృద్ధుడు అనే కంటే యువకుడు అనడమే సమజసంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వయసులో కండల వీరుడిగా పేరు గడించడంతో పాటూ ఎంతో మందికి శిక్షణ ఇచ్చి.. మార్గదర్శిగా కూడా మారారు. త్వరలో దేశం తరపున "మిస్టర్ ఆసియా" పోటీల్లో పాల్గొంటున్న ఆ వ్యక్తికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా మదురాంతకానికి చెందిన రత్నం అనే వ్యక్తి.. 72  ఏళ్ల వయసులో జిమ్మాస్టర్‌గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రాణించడమే కాకుండా ఎంతో మందికి శిక్షణ ఇచ్చి మంచి గురువుగా కూడా పేరుపొందాడు. ఈయనకు ఎప్పటినుంచో జిమ్మాస్టర్ అవ్వాలని కోరిక ఉండేది. ఈ క్రమంలో తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు.. 60ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌గా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తానూ కష్టపడ్డాడు. చివరకు అనుకున్న కోరికను నెరవేర్చుకున్నాడు.

రూ.93 కోట్ల ఆస్తికి వారసురాలు.. అయినా రూపాయి కూడా వాడుకోలేని స్థితి.. మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‌తో..!


జిమ్మాస్టర్ అవడమే కాకుండా ఎంతో మందికి శిక్షణ ఇచ్చి మంచి గురువుగా కూడా మారాడు. గతంలో మిస్టర్ కంచి, మిస్టర్ తమిళనాడు, మిస్టర్ సెలవుత్ ఇండియా, మిస్టర్ ఇండియా.. పోటీల్లో పాల్గొన్నాడు. అలాగే  మే 22న హిమాచల్ ప్రదేశ్‌లో "ఫిట్‌నెస్ మాస్టర్" విభాగంలో జరిగిన ప్రాథమిక బాడీబిల్డింగ్ పోటీలకు కూడా ఎంపికయ్యాడు. తద్వారా జూలై 15న మాల్దీవుల్లో జరిగే 60ఏళ్ల విభాగంలో "మిస్టర్ ఆసియా" పోటీల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అర్హత సాధించాడు. అదేవిధంగా డిసెంబర్ 5న థాయ్‌లాండ్‌లో జరిగే ప్రపంచ పురుషుల ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొననున్నాడు.

83 ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ.. ఎంత సులభంగా బరువు ఎత్తుతుందో మీరే చూడండి..


తన రోల్‌ మోడల్ తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు అని, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని రత్నం చెబుతున్నాడు. మరోవపు తమ గురువు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని రత్నం విద్యార్థులు తెలిపారు. మిస్టర్ ఆసియా పోటీల్లో తమ గురువు తప్పక విజయం సాధిస్తారని వారు ఆకాంక్షిస్తున్నారు. ఆ పోటీల్లో రత్నం విజయకేతనం ఎగురవేయాలని మనమూ కోరుకుందాం.

కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..



Updated Date - 2022-06-24T21:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising