రూ.93 కోట్ల ఆస్తికి వారసురాలు.. అయినా రూపాయి కూడా వాడుకోలేని స్థితి.. మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‌తో..!

ABN , First Publish Date - 2022-06-23T01:59:34+05:30 IST

ఆమె తండ్రి కోటీశ్వరుడు. ప్రస్తుతం ఆమె రూ.93కోట్లకు వారసురాలు. తాను, తన పిల్లలు తిన్నా తరగని ఆస్తి. ఈ స్థానంలో ఎవరున్నా నిశ్చింతగా జీవనం సాగిస్తారు. అయితే అంత ఆస్తి ఉన్నా..

రూ.93 కోట్ల ఆస్తికి వారసురాలు.. అయినా రూపాయి కూడా వాడుకోలేని స్థితి.. మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‌తో..!

ఆమె తండ్రి కోటీశ్వరుడు. ప్రస్తుతం ఆమె రూ.93కోట్లకు వారసురాలు. తాను, తన పిల్లలు తిన్నా తరగని ఆస్తి. ఈ స్థానంలో ఎవరున్నా నిశ్చింతగా జీవనం సాగిస్తారు. అయితే అంత ఆస్తి ఉన్నా.. ఈమెకు మాత్రం ఇసుమంత ఆనందం కూడా లేదు. ఎందుకంటే ఆస్తిలో రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి. మరణించే ముందు ఆమె తండ్రి పెట్టిన కండీషన్‌తో ఈ కష్టం వచ్చిపడింది. ఇంతకీ ఆమె ఎవరు, ఆమె తండ్రి పెట్టిన కండీషన్ ఏంటీ.. అనే వివరాల్లోకి వెళితే..


ఆస్ట్రేలియాలోని సడ్నీ పరిధికి చెందిన క్లేర్ బ్రౌన్ అనే మహిళ.. ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈమె ప్రస్తుతం $12 మిలియన్ల (రూ.93 కోట్లు) ఆస్తికి వారసురాలు. అయినా ఈమెకు ఏమాత్రం ఆనందం లేదు. ఈమె తండ్రి పెట్టిన కండీషన్ కారణంగా ఆ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి. అయితే ఈమె  అటెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అనే సమస్యతో బాధపడుతోంది. తన ఆరోగ్యం బాగోలేదని, ఆస్తి తనకు అప్పజెపితే వైద్యం చేయించుకుంటానని వేడుకుంటోంది. అయినా ఆమె ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. దీంతో తన తండ్రి ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించింది.

ఉన్నట్టుండి చనిపోయిన మహిళ.. ఇంట్లో ఉన్న 20 పెంపుడు పిల్లులకు భోజనం పెట్టే వారే లేక ఆమె మృతదేహాన్నే..


శాశ్వత ఉద్యోగం పొందడమే కాకుండా నలుగురికి సాయం చేసే స్థాయి ఉన్నప్పుడే తన ఆస్తి కుమార్తెకు చెందుతుందని క్లేర్ బ్రౌన్ తండ్రి చనిపోయే ముందు కండీషన్ పెట్టాడు. అనారోగ్య కారణంగా ఆమె ఉద్యోగం పొందలేని పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే కావడంతో ఎవరికీ సాయం చేయలేని స్థితిలో ఉంది. దీంతో కళ్ల ముందే వందల కోట్ల ఆస్తి ఉన్నా.. అనుభవించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆ ఆస్తి మొత్తం తన తండ్రి స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది. నిబంధనలు పాటిస్తేనే ఆస్తి అప్పజెబుతామని ట్రస్ట్ నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. తండ్రి ఆస్తిని వారసత్వంగా పొందలేకపోతున్న ఈమెను.. స్థానికంగా అంతా 'బ్రేక్ మిలియనీర్' అని పిలుస్తుంటారు. కోర్టులో ఆమె న్యాయపోరాటం ఫలిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

9 నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి.. తాగడానికి నీళ్లు కూడా లేవంటూ ముఖ్యమంత్రికి మెయిల్ పంపిన భర్త.. చివరకు..

Updated Date - 2022-06-23T01:59:34+05:30 IST