కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-17T14:45:01+05:30 IST

చాలా మందికి డబ్బు, కీర్తి ప్రతిష్టలపైనే కోరికలు ఉంటాయి. అదే వారి జీవిత ఆశయంగా బతుకుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు అలాంటి కోరికలేవీ లేవు. కోట్ల..

కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..

చాలా మందికి డబ్బు, కీర్తి ప్రతిష్టలపైనే కోరికలు ఉంటాయి. అదే వారి జీవిత ఆశయంగా బతుకుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు అలాంటి కోరికలేవీ లేవు. కోట్ల రూపాయలు వద్దు.. కనీసం ఒక్కసారి కూర్చుంటే చాలనేది ఆమె కోరిక. 30సంవత్సరాలుగా ఆమెకు ఇది తీరని కోరికగా మిగిలింది. కూర్చోవడం కోరిక ఏంటని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్య ఏంటో తెలిస్తే.. అయ్యో పాపం అని అంటారు.


పోలాండ్‌కు చెందిన జోవన్నా క్లిచ్‌ అనే యువతి ఓ అరుదైన సమస్యతో బాధపడుతోంది. ఆమె చిన్న వయసులో వెన్నెముక, కండరాల క్షీణత (spinal muscular atrophy)వ్యాధికి  గురైంది. అరుదైన జన్యుపరమైన సమస్య కారణంగా కేవలం నిలబడడం, లేదా పడుకోవడం తప్ప కూర్చోలేని పరిస్థితి. ’’చివరగా రెండేళ్ల వయసులో కూర్చున్నట్లు మా అమ్మ చెప్పింది... కానీ నాకు గుర్తులేదు’’.. అని యువతి చెబుతోంది. ప్రస్తుతం 30ఏళ్ల వయసున్న ఈమెకు.. కూర్చోవడమనేది తీరని కోరికగా మిగిలింది. 21ఏళ్ల వయస్సు వరకూ.. ఆమె సాధారణ జీవితాన్ని గడిపింది.  అయితే 2011లో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో అప్పటి నుంచి నిలబడి ఉండేందుకు వీలుగా వీల్‌చైర్‌ను వినియోగిస్తోంది.

ఈ ఫొటోలోని అమ్మాయి వయసు ఎంతో ఊహించగలరా..? అసలు నిజం తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం..!


ప్రస్తుతం ఆమె కూర్చోవడానికి ఇబ్బందిపడడంతో పాటూ నడవడానికి కూడా సాధ్యం కావడం లేదు. వీల్‌చైర్‌ సాయంతోనే ఆమె ముందుకు కదలగలుగుతోంది. మోకాళ్లు మరింత బలహీనంగా మారడంతో రోజూ నొప్పితో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ వ్యాధికి చికిత్స చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం ఫిజియోథెరపీ చికిత్స చేయించుకునేందుకు విరాళాలు సేకరించేందుకు GoFundMe అనే పేజీని ప్రారంభించింది. నెయిల్ టెక్నీషియన్‌గా బ్యూటీ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం ఈ వ్యాధి కారణంగా రోజూ వివిధ సమస్యలతో సతమతమవుతోంది. చికిత్స చేయించుకునేందుకు దాతలు సహకరించాలని వేడుకుంటోంది.

ఒకే ఒక్క పొటాటో చిప్ పీస్ ధర ఏకంగా రూ.1.63 లక్షలు.. ఇంత ఖరీదేంటని ఆశ్చర్యపోతున్నారా..?

Updated Date - 2022-05-17T14:45:01+05:30 IST