Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 21 May 2022 16:30:04 IST

Viral Video: 83 ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ.. ఎంత సులభంగా బరువు ఎత్తుతుందో మీరే చూడండి..

twitter-iconwatsapp-iconfb-icon

కొందరు వయసును కేవలం ఒక సంఖ్యగా మాత్రమే చూస్తారు. ఫిట్‌నెస్ విషయంలో మాత్రం యువకులతో పోటీపడుతుంటారు. కొందరు వృద్ధులైతే యువకులు కూడా చేయలేని పనులను చాలా అవలీలగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలోని ఓ వృద్ధురాలు కూడా ఈ కోవకే చెందుతుంది. 83ఏళ్ల ఓ వృద్ధురాలు బరువును అవలీలగా ఎత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో కిరణ్ బాయి అనే 83 ఏళ్ల వృద్ధురాలు మేడపై deadlift చేస్తూ ఉంటుంది. ఆమె మనవడి ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని అవలీలగా పూర్తి చేస్తుంది. 25 కిలోల బరువును ఎంతో సులభంగా పైకి ఎత్తడంతో పాటూ కాసేపు అలాగే ఎత్తుకుని ఉండడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తర్వాత దాన్ని మనవడికి అందిస్తుంది.

అంతా చూస్తుండగా నడి రోడ్డుపైకి వచ్చిన భారీ అనకొండ.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ఆమె ఫిట్‌నెస్ విషయంలో ఎప్పటి నుంచో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేదని, అయితే కాలికి గాయమవడంతో ఏడాదిగా కసరత్తులకు దూరంగా ఉందని తెలిసింది. ప్రస్తుతం మనవడు విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌‌ను ఈజీగా పూర్తి చేయడంతో అతడితో పాటు వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. పలువురు నెటిజన్లు వృద్ధురాలిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూసిన యువకుడు.. మరుక్షణమే అతడి పరిస్థితి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

తనను దూరం పెడుతోందనే కారణంతో ప్రేయసిని గోవా తీసుకెళ్లాడు.. బీచ్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం.. మరుసటి రోజు చూస్తే..చెట్టుకు ఉరి వేసి పదేళ్ల బాలుడిని చంపేశారు.. ఎవరి మీదైనా అనుమానం ఉందా అని ఆ తండ్రిని అడిగితే..ఈ ఫొటోలోని బాలికను చూశారా..? రెండు మూడేళ్ల వయసే ఉంటుందనుకుంటున్నారా..? అసలు నిజమేంటో తెలిస్తే..ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులు కూడా కాకముందే ఓ యువకుడి బలవన్మరణం.. తండ్రికి చివరగా వాట్సప్‌లో పంపిన మెసేజ్‌లో..5 నెలల క్రితం పెళ్లి.. డాబాపై పడుకుని పొద్దునే కొడుకు, కోడల్ని లేపేందుకు వస్తే గదిలో కనిపించిన దృశ్యం చూసి..!ఈ ఫొటోలోని ఆరేళ్ల పాప ఇప్పుడు బతికిలేదు కానీ అయిదుగురి ప్రాణాలను కాపాడింది.. అసలేం జరిగిందంటే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.