YCP Minister Dharmana: మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది
ABN, First Publish Date - 2022-11-08T17:53:49+05:30
తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
dharmana prasada rao, YCP
శ్రీకాకుళం: తమ ప్రభుత్వం (government)పై వ్యతిరేకత ఉందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు (YCP Minister Dharmana Prasadarao) అన్నారు. దీనికి కారణం సంస్కరణలను జనం అర్థం చేసుకోలేకపోవడమే అని మంత్రి స్పష్టం చేశారు. సంస్కరణలు చేసేవారికి వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని, సంస్కరణలకు ముందే ఫలితాలురావు.. అందుకే ప్రజల ఆమోదం రాదని ధర్మాన చెప్పారు. సంస్కరణలతో ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా సీఎం జగన్ సంస్కరణల బాట పట్టారని శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
Updated Date - 2022-11-08T17:53:54+05:30 IST