ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India on priority: భారత్‌కే తొలి ప్రాధాన్యత.. ఏడాదికి 12 లక్షల వీసాలు

ABN, First Publish Date - 2022-11-11T07:23:40+05:30

అమెరికా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు శుభవార్త. వీసాల జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. దరఖాస్తుదారు వీసా కోసం ఎదురుచూసే సమయం (వెయిటింగ్‌ పీరియడ్‌) తగ్గబోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇక వేగంగా అమెరికా వీసా!

2023 వేసవికి తగ్గనున్న వెయిటింగ్‌ పీరియడ్‌

న్యూఢిల్లీ, నవంబరు 10: అమెరికా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు శుభవార్త. వీసాల జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. దరఖాస్తుదారు వీసా కోసం ఎదురుచూసే సమయం (వెయిటింగ్‌ పీరియడ్‌) తగ్గబోతుంది. ప్రస్తుతమున్న వెయిటింగ్‌ పీరియడ్‌ను 2023 వేసవి నాటికి మరింత తగ్గిస్తామని అమెరికా దౌత్య కార్యాలయానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి గురువారం వెల్లడించారు. కరోనా అనంతరం భారత్‌ నుంచి వీసా దరఖాస్తులు అధికమయ్యాయి. దీంతో హెచ్‌1బీ, ఎల్‌తోపాటు బీ1, బీ2(బిజినెస్‌, టూరిస్ట్‌) వీసాలకు సంబంధించి 450 రోజులుగా ఉన్న వెయిటింగ్‌ పీరియడ్‌ను ఇటీవల తొమ్మిది నెలలకు తగ్గించారు. ఈ సమయాన్ని మరింత తగ్గించాలని నిర్ణయించారు. భారతీయులకు వీసాల ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇందులో భాగంగా ఏడాదికి 12 లక్షల వీసాలు ముంజూరు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నామని ఆ అధికారి తెలిపారు. వచ్చే వేసవి కల్లా కరోనా మునుపటి పరిస్థితులను తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. హెచ్‌1బీ, ఎల్‌ కేటగిరీ వీసాల రెన్యువల్‌ కోసం చూస్తున్న వారి కోసం ఇటీవల లక్ష స్లాట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

Updated Date - 2022-11-11T07:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising