ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meta: ఉద్యోగం కోసం కెనడా వెళ్లిన ఎన్నారైకు.. ఊహించని షాకిచ్చిన 'మెటా'

ABN, First Publish Date - 2022-11-11T07:44:37+05:30

ఇంజనీరింగ్‌ విద్యకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివాడు హిమాన్షు. అనంతరం ఫ్లిప్‌కార్ట్‌, అడోబ్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలువు కోసం భారత్‌ నుంచి కెనడాకు...

చేరిన రెండ్రోజులకే తీసేసిన ఫేస్‌బుక్‌

న్యూఢిల్లీ, నవంబరు 10: ఇంజనీరింగ్‌ విద్యకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివాడు హిమాన్షు. అనంతరం ఫ్లిప్‌కార్ట్‌, అడోబ్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేశాడు. ప్రఖ్యాత సోషల్‌ మీడియా కంపెనీ ఫేస్‌బుక్‌కు చెందిన కెనడా ఆఫీసులో ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషించాడు. కెనడా వెళ్లి ఉద్యోగంలో జాయినయ్యాడు. అలా రెండ్రోజులు ఆఫీసుకు వెళ్లాడో లేదో ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించింది ఆ కంపెనీ. 11 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో హిమాన్షు కూడా ఉన్నాడు. ఉద్యోగంలో జాయినైన రెండ్రోజుల్లోనే ఇలా జరగడంపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ లింక్డ్‌ఇన్‌లో పోస్టు పెట్టాడు. ‘‘మెటాలో జాయినవడానికి కెనడా వెళ్లాను. జాయినైన రెండ్రోజులకే ఉద్యోగ ప్రయాణం ముగిసింది. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు.

కెనడా లేదా ఇండియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు’’ అని తన పరిస్థితిని వివరించాడు. దీనికి అనేకమంది సానుకూలంగా స్పందిస్తూ తమకు తెలిసిన ఉద్యోగాల సమాచారం ఇస్తున్నారు. ఉద్యోగుల పట్ల ఏ మాత్రం జాలి, సానుభూతి లేకుండా మెటా నిర్ణయం తీసుకుందని మరికొంతమంది నెటిజెన్లు వ్యాఖ్యానించారు. కాగా, మొత్తం ఉద్యోగుల్లో సుమారు 13 శాతం మందిని మెటా ఒకేసారి కొలువుల నుంచి తొలగించింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే అతిపెద్ద లేఆఫ్‌. ఆదాయం భారీగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా... తొలగించిన ఉద్యోగులకు ఆయన ‘సారీ’ చెప్పారు.

Updated Date - 2022-11-11T07:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising