ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ప్రవాసులకు ముఖ్య గమనిక.. రేపే ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..

ABN, First Publish Date - 2022-11-15T12:06:51+05:30

కువైత్‌ (Kuwait)లోని భారత ఎంబసీ (Indian Embassy) రేపు (బుధవారం) ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రాయబార కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల(కువైత్ కాలమానం ప్రకారం) వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌ (Kuwait)లోని భారత ఎంబసీ (Indian Embassy) రేపు (బుధవారం) ఓపెన్ హౌస్ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రాయబార కార్యాలయం ప్రాంగణంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల(కువైత్ కాలమానం ప్రకారం) వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కువైత్‌లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో (Virtual platform) నిర్వహించడం లేదని ఈ సందర్భంగా ఎంబసీ స్పష్టం చేసింది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా ఎంబసీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎంబసీ వద్ద ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు వీలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైత్‌లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన amboff.kuwait@mea.gov.in కు ఈ-మెయిల్ చేయాలి.

Updated Date - 2022-11-15T12:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising