Himachal Pradesh Results : హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక పరిణామం
ABN, First Publish Date - 2022-12-08T09:17:32+05:30
హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతోంది.
Himachal Pradesh
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో విజయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతోంది. కాసేపు కాంగ్రెస్, కాసేపు బీజేపీ ముందంజలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ 37 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి జైరామ్ ఠాకూర్ సెరాజ్ స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఒక స్థానంలోనైనా ముందంజలో కనిపించలేదు. ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.
గుజరాత్‌లో బీజేపీ 131 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 42 స్థానాల్లోనూ, ఆప్ 5 స్థానాల్లోనూ, ఇతరులు నాలుగు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు.
Updated Date - 2022-12-08T09:17:38+05:30 IST