Himachal Pradesh Results : హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ముందంజ
ABN, First Publish Date - 2022-12-08T08:39:26+05:30
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తోంది.
Himachal Pradesh
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో బీజేపీ 30 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి జైరామ్ ఠాకూర్ సెరాజ్ స్థానంలో ముందంజలో ఉన్నారు.
అదేవిధంగా గుజరాత్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా స్థానంలో ముందంజలో ఉన్నారు. క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి, బీజేపీ అభ్యర్థి రివబ జడేజా జామ్ నగర్ నార్త్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు.
బీజేపీ అభ్యర్థి జితేంద్ర భాయ్ పటేల్ బయద్ స్థానంలో ముందంజలో ఉన్నారు.
Updated Date - 2022-12-08T08:39:30+05:30 IST