Gujarat Results : ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్
ABN, First Publish Date - 2022-12-08T09:00:33+05:30
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ
Isudan Gadhvi
గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ వెనుకంజలో ఉన్నారు. కటర్‌గామ్ నియోజకవర్గంలో ఆయన వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ వీరంగమ్ నుంచి మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చారు.
హిమాచల్ ప్రదేశ్‌లో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఒక స్థానంలోనైనా ముందంజలో కనిపించడం లేదు. బీజేపీ 33 స్థానాల్లో, కాంగ్రెస్ 34 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
Updated Date - 2022-12-08T09:00:37+05:30 IST