ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Eliza: చింతలపూడి ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2022-12-20T09:54:25+05:30

జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఎలీజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు వున్నమాట్ల రాకడ ఎలీజా (Chintalapudi MLA Eliza)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభానికి ఢీ కొట్టింది. అయితే కారులో బెలూన్లు ఓపెన్ అవ్వడంతో ఎలీజా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యేతో పాటు కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే వేరే వాహనంలో జంగారెడ్డిగూడెం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ప్రమాదంలో ఎమ్మెల్యే ఎలీజా సురక్షితంగా బయటపడటంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2022-12-20T09:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising