Vishnukumar Raju: వారాహి వెహికల్పై ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2022-12-15T15:03:52+05:30
కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana)-నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) భేటీ అయితే తప్పు ఏంటి? ఇరు పార్టీలు తాజా రాజకీయాలపై
విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena chief Pawan Kalyan)కు చెందిన వారాహి వాహనాన్ని (Varahi vehicle) ఏపీలో ఎవరూ అడ్డుకోలేరని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు (BJP State Vice President Vishnukumar Raju) తెలిపారు. వారాహి వెహికల్ కలర్ కరెక్టైన కలరేనని అభిప్రాయపడ్డారు. కాకపోతే రంగును చూసే వారిని బట్టే తేడా ఉంటుందని చెప్పుకొచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana)-నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) భేటీ అయితే తప్పు ఏంటి? ఇరు పార్టీలు తాజా రాజకీయాలపై చర్చించుకున్నారేమోనని పేర్కొన్నారు. 175 నియోజకవర్గంలో గెలుస్తామని వైసీపీ నేతలు నియంతృత్వ ధోరణిలో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు ప్రజలు ఘన స్వాగతం పలికినంత మాత్రాన ఓట్లు రావని మంత్రి రోజా(Minister Roja) తెలుసుకోవాలని సూచించారు. మా ఇంటి వైపు రోజు వెళ్తే తాను కూడా వ్యక్తిగతంగా స్వాగతం పలుకుతానన్నారు.
Updated Date - 2022-12-15T15:05:02+05:30 IST