ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchannaidu: మాచర్లలో పిన్నెల్లి గూండాగురి పరాకాష్టకు చేరింది

ABN, First Publish Date - 2022-12-16T22:29:44+05:30

Palnadu: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గూండాగురి పరాకాష్టకు చేరిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నాయకులు మాచర్లలో విధ్వంసానికి పాల్పడడంపై ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Palnadu: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గూండాగురి పరాకాష్టకు చేరిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నాయకులు మాచర్లలో విధ్వంసానికి పాల్పడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్‌చార్జి బ్రహ్మారెడ్డికి చిన్నపాటి అపాయం కలిగించినా పిన్నెళ్లి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

‘‘టీడీపీ (TDP) ఇన్‌చార్జి బ్రహ్మారెడ్డిని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. తక్షణమే ఆయనను విడుదల చేయాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి దగ్గరుండి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారు. టీడీపీ సానుభూతి పరుల దుకాణాలను కూడా తగలబెట్టారు. వైసీపీ(YCP) నేతల దుశ్చర్యలను పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. పోలీసులు చూస్తూ ఉండటం దుర్మార్గం. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తున్న బ్రహ్మారెడ్డికి వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మా బ్రహ్మారెడ్డిని చూసి పిన్నెల్లి ప్రతి రోజూ భయపడుతూ బతుకుతున్నాడు. మాచర్లను గూండాగిరితో మూడున్నరేళ్లుగా చేతిలో పెట్టుకున్నారు. ప్రజల నుండి తిరుగుబాటు మొదలవడంతో విధ్వంసాలు చేస్తున్నారు. ఖబడ్దార్ పిన్నెల్లి..నీ పని అయిపోయింది. నీ ఓటమికి రోజులు లెక్కపెట్టుకో. ‘మాచర్ల పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జాగీరా? ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేయకూడదా?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2022-12-16T22:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising