ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: నకిలీ సేవా టిక్కెట్ల కుంభకోణం గుట్టురట్టు.. విజిలెన్స్ అదుపులో తిరుమల ఉద్యోగి

ABN, First Publish Date - 2022-12-07T19:10:00+05:30

తిరుమల (Tirumala) ఉద్యోగి శ్రీహరిని టీటీడీ విజిలెన్స్ (TTD vigilance) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల (Tirumala) ఉద్యోగి శ్రీహరిని టీటీడీ విజిలెన్స్ (TTD vigilance) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఫారసు లేఖలను వీఐపీ భక్తులకు విక్రయిస్తున్నారని శ్రీహరిపై ఆరోపణలు వచ్చాయి. గతంలో టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ దగ్గర శ్రీహరి పనిచేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు తెలిపారు. నందిగామ ఎమ్మెల్యే సిఫారసు లేఖపై 6 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు రూ.18 వేలకు శ్రీహరి విక్రయించినట్లు పేర్కొన్నారు. శ్రీహరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.

తిరుమలలో నకిలీ సేవా టిక్కెట్ల కుంభకోణం గుట్టురట్టు అయింది. నకిలీ సుప్రభాత సేవా టికెట్లతో దర్శనానికి వెళ్తున్న వారిని టీటీడీ అధికారులు పట్టుకున్నారు. 23 మంది భక్తుల దగ్గర నకిలీ సేవా టికెట్లను గుర్తించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. సేలం కేంద్రంగా నకిలీ టికెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ విజిలెన్స్ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-12-07T19:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising