ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pattabhi Ram: జగన్ పాలనలో ఏపీ “అరాచకప్రదేశ్”గా తయారైంది.

ABN, First Publish Date - 2022-11-21T18:36:38+05:30

Amaravathi: టీడీపీ (TDP) జాతీయ అధికారప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి జగన్ పాలన (CM Jagan)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ కాస్త “అరాచకప్రదేశ్” గా మారిందని, రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: టీడీపీ (TDP) జాతీయ అధికారప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి జగన్ పాలన (CM Jagan)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ కాస్త “అరాచకప్రదేశ్” గా మారిందని, రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. జగన్ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో ఆర్బీఐ (RBI) తాజానివేదికతో బట్టబయలైందన్నారు. 2014-2019 మధ్యకాలంలో 53.92 శాతం జీఎస్డీపీ పెరిగి 10.78 శాతం గ్రోత్ రేట్ సాధించిన రాష్ట్రం.. జగన్ పాలనలో గ్రోత్ రేట్ 6.4శాతానికి పతనమైందని తెలిపారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.లక్షా20వేలకోట్లు పెరగ్గా..చంద్రబాబు పాలనలో రూ.2లక్షల20వేలకోట్లు పెరిగిందనే వాస్తవాన్ని వైసీపీ శ్రేణులు గమనించాలని కోరారు. 2014-19 మధ్య కాలంలో మధ్య కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి పెద్ద రాష్ట్రాలకంటే మెరుగైన డబుల్ డిజిట్ గ్రోత్ రేట్‌ను చంద్రబాబు సారథ్యంలో ఏపీ సాధించిందని గుర్తు చేశారు. బాబు సారథ్యంలో నిర్మాణరంగం క్లిష్టపరిస్థితులను సైతం తట్టుకొని 4.7శాతం వృద్ధిచెందగా, నేడు జేట్యాక్స్ సీఎం పాలనలో 1.9శాతానికి దిగజారిందని తెలిపారు. ఆర్బీఐ నివేదికలో ఏ అంశాన్ని తీసుకున్నా.. రాష్ట్రం పరిస్థితి జగన్ పాలనలో ఎంత దయనీయంగా ఉందో స్పష్టమవుతోందన్నారు.

Updated Date - 2022-11-21T18:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising