యాదాద్రిలో భారీ పేలుడు..
ABN, Publish Date - Jan 04 , 2025 | 11:19 AM
పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ఇవాళ(శనివారం) ఉదయం ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి ఓ కార్మికుడు మృతిచెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
యాదాద్రి: పెద్దకందుకూరు (Peddakandukuru)లో భారీ పేలుడు సంభవించింది. ఇవాళ(శనివారం) ఉదయం ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీ (Premier Explosives Company)లో రియాక్టర్ పేలి (Reactor explosion) భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి ఓ కార్మికుడు మృతిచెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితులను 108 సహాయంతో హుటాహుటిన ఆస్పత్రికి తలించారు. మరోవైపు మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపకశాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో పేలుడు సంభవించగా.. కార్మికులంతా కంపెనీ నుంచి పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక భయంతో కేకలు వేశారు. పేలుడు ధాటికి భవనం సైతం కూలిపోయింది.
Updated Date - Jan 04 , 2025 | 11:21 AM