రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం..
ABN, Publish Date - Jan 06 , 2025 | 05:34 PM
హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండో అతి పెద్దదైన ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్(Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు.
హైదరాబాద్: నగరంలో పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండో అతి పెద్దదైన ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్ (Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు. 4.08 కి.మీ. పొడువు, 23 మీటర్ల వెడల్పుతో రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా, నేడు(సోమవారం) సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. దీంతో తాడ్ బన్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హాసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ల ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అలాగే బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రవేశించవచ్చు. ఎంజీబీఎస్ బహదూర్‌పుర నుంచి ఎయిర్‌పోర్ట్, బెంగళూరు హైవేకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా త్వరగా గమ్య స్థానాలకు చేరొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్..
ఫార్ములా-ఈ కారు రేసు కేసు.. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్..
పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 06 , 2025 | 05:35 PM