కేటీఆర్‌ని వెంటాడుతున్న ఏసీబీ, ఈడీ..
ABN, Publish Date - Jan 06 , 2025 | 10:08 PM
ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula-E car race) కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ని వెంటాడుతోంది. ఏసీబీ (ACB), ఈడీ (ED) అధికారులు వరస నోటీసులతో కేటీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula-E car race) కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ని వెంటాడుతోంది. ఏసీబీ (ACB), ఈడీ (ED) అధికారులు వరస నోటీసులతో కేటీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో సోమవారం ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చిన కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో న్యాయవాది వస్తే నష్టమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. రోడ్డుపైనే తన స్పందనను ఏసీబీ అధికారులకు లిఖిత పూర్వకంగా అందజేసి అక్కడ్నుంచి వెనుతిరిగారు.
Updated Date - Jan 06 , 2025 | 10:12 PM