ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేతనాలు చెల్లించాలని కార్మికుల సమ్మె

ABN, Publish Date - Jan 31 , 2025 | 01:26 AM

రెండు నెలలుగా రావాల్సిన వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తె లంగాణ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన పట్టణాధ్యక్షుడు ఎండీ సలీం ఆధ్వర్యంలో గురువారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు సమ్మెకు దిగారు.

కార్మికులతో మాట్లాడుతున్న సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌

వేతనాలు చెల్లించాలని కార్మికుల సమ్మె

రామగిరి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రెండు నెలలుగా రావాల్సిన వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తె లంగాణ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన పట్టణాధ్యక్షుడు ఎండీ సలీం ఆధ్వర్యంలో గురువారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ రెండు నెలలుగా కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా మునిసిపల్‌ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలు ఉన్నప్పటికీ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. 9నెలల ఏరియర్స్‌ బిల్లులు ఇవ్వడంలో అధికారులు, కాంట్రాక్టర్లు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

కమిషనర్‌ హామీతో తాత్కాలిక విరమణ

కార్మికుల వద్దకు మునిసిపల్‌ కమిషనర్‌ సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌ హాజరై 4 రోజుల్లో 2 నెలల వేతనాలు బ్యాంకులో వేతనాలు పడేలా చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు సమ్మెను తాత్కాలికంగా విర మిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సోమవారం నాటికి వేతనాలు రాకపోతే మంగళవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ిసీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ నాయకులు కోట్ల అశోక్‌రెడ్డి, నాయకులు గండమల్ల శ్రీనివాస్‌, పెరిక కళ్యాణ్‌, పెరిక కృష్ణ, జిడిమెట్ల నర్సింహ, కత్తుల కృష్ణవేణి, పందుల లింగయ్య, ఎర్ర శ్రీను, పాండు తదితరులు పాల్గోన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 01:27 AM