ట్యాంకర్‌తో పొలానికి నీరు
ABN, Publish Date - Mar 04 , 2025 | 01:06 AM
భూగర్భ జలాలు రోజు రోజుకు పడిపోవడంతో వరి పంట ఎండిపోకుం డా కాపాడుకోవడానికి సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో రైతు సత్తయ్య ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పోస్తున్నాడు.
ఎల్లారెడ్డిపేట, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలు రోజు రోజుకు పడిపోవడంతో వరి పంట ఎండిపోకుం డా కాపాడుకోవడానికి సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో రైతు సత్తయ్య ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పోస్తున్నాడు. సత్తయ్య నాలుగు ఎకరాల్లో వరిపంట వేశాడు. రెండు బోర్లు ఉండగా ఒక బోరు ఎండి పోయింది. మరో బోరు నుంచి ధారగా నీరు వస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రెండు ఎకరాలు వదిలిపెట్టి మరో రెండు ఎకరాలకు ట్యాంకర్ ద్వారా నీరు పెట్టి పంటను కాపాడుకుంటున్నాడు. ఇందుకు నీరు అందించినపుడు రూ.5వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. మూడు రోజులకు ఒకసారి ఐదు ట్యాంకర్ల ద్వారా నీరు పెడుతున్నట్లు రైతు తెలిపాడు.
Updated Date - Mar 04 , 2025 | 01:06 AM