విశ్వశాంతి మహాయాగం ప్రారంభం...
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:05 AM
లోక కళ్యాణం కొరకు తలపెట్టిన శ్రీ వైష్ణవ అయుత చండీ అతిరుద్రం శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ నేతృత్వంలో నస్పూర్‌లో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం శనివారం ప్రారంభమైంది. 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా తొలిరోజు మహా గణపతి పూజ కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
తొలి రోజు గణపతి పూజ...
నస్పూర్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : లోక కళ్యాణం కొరకు తలపెట్టిన శ్రీ వైష్ణవ అయుత చండీ అతిరుద్రం శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ నేతృత్వంలో నస్పూర్‌లో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం శనివారం ప్రారంభమైంది. 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా తొలిరోజు మహా గణపతి పూజ కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. గణపతి పూజ, శుద్దిపుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, బుత్విక్‌వరుణ , గో సహిత యాగశాల ప్రవేశం, ఆఖండ జ్యోతి, స్థాపన, యాగశాల సంస్కారాలు, మాతృకాపూజ, మంటపారాధనలు, వాస్తు హోమం, ప్రధాన మంటపారాధనలు, ప్రధాన కలశ స్థాపన, అగ్ని మథన, ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పూజల్లో పాల్గొన్నారు. పట్టణంలో 16 రోజుల పాటు మార్చి 2వ తేది వరకు యాగ కార్యక్రమాలు జరుగనుండడంతో నస్పూర్ పట్టణం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఆదివారం ఉదయం గణపతి, లక్ష్మి గణపతి, సూర్య హోమాలు, సాయంత్రం గణపతికి లక్ష గరికార్చన, శ్రీ సిద్ది బుద్ది సమేత వరసిద్ది వినాయక కళ్యాణ మహోత్సవం జరుగనుంది.
Updated Date - Feb 16 , 2025 | 12:05 AM