Venu Swamy: నన్ను క్షమించండి
ABN, Publish Date - Jan 22 , 2025 | 05:21 AM
తెలంగాణ మహిళా కమిషన్‌కు వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్‌పర్సన్ నేరేళ్ల శారదకు లిఖితపూర్వకంగా క్షమాపణ లేఖను అందించారు.
మహిళా కమిషన్‌ను లిఖిత పూర్వకంగా కోరిన వేణుస్వామి
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మహిళా కమిషన్‌కు వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్‌పర్సన్ నేరేళ్ల శారదకు లిఖితపూర్వకంగా క్షమాపణ లేఖను అందించారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడినవారికి క్షమాపణ చెబుతున్నానని, మరోసారి ఇలాంటిది జరగదని వేణుస్వామి పేర్కొన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి పలు వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలపై పలువురు మహి ళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తమ ఎదు ట హాజరవ్వాలంటూ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను వేణుస్వామి హైకోర్టులో సవాల్ చేశారు. కమిషన్ ఎదుట వేణుస్వామి బదులు అతని న్యాయవాదుల బృందం హాజరైంది. మరోవైపు, మహిళా కమిషన్ ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని హైకోర్టు వేణుస్వామిని ఇటీవల ఆదేశించింది. దీంతో ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లి చైర్‌పర్సన్‌కు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Updated Date - Jan 22 , 2025 | 05:21 AM