జాతరలకు వేళాయె...
ABN, Publish Date - Feb 02 , 2025 | 01:19 AM
సంక్రాంతి పండుగ ముగిసింది. జాతరల పండుగ మొదలైంది. ఇక ఉమ్మడి మండలవ్యాప్తంగా జాతరలు జరగనున్నాయి. మాఘమాసం మొదలు కావడంతో మండలంలోని బాలాజీనగర్ వేంకటేశ్వరస్వామి, మేడారం లక్ష్మీనర్సింహస్వామి, కోదండపురం వేంకటేశ్వరస్వామి జాతరలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జాతరలకు వేళాయె...
నేటి నుంచి మండలంలో ఆధ్యాత్మిక శోభ
గ్రామాల్లో ప్రారంభమైన సందడి
కళాకారులు, చిరువ్యాపారులకు ఉపాధి
పెద్దఅడిశర్లపల్లి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ ముగిసింది. జాతరల పండుగ మొదలైంది. ఇక ఉమ్మడి మండలవ్యాప్తంగా జాతరలు జరగనున్నాయి. మాఘమాసం మొదలు కావడంతో మండలంలోని బాలాజీనగర్ వేంకటేశ్వరస్వామి, మేడారం లక్ష్మీనర్సింహస్వామి, కోదండపురం వేంకటేశ్వరస్వామి జాతరలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబు
మండలంలోని మేడారం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాల సాగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని విద్యుత దీపాలతో సుందరంగా అలంకరించారు. నిత్య పూజలు, భక్తుల సందడితో వెలుగొందుతున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తుల రానున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అయిదు రోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాల వివరాలను దేవస్థాన కమిటీ చైర్మన యల్గూరి చెన్నారెడ్డి వెల్లడించారు. 1, 2వ తేదీన నిత్యహోమం, దీపారాధన, 3న కల్యాణోత్సవం, 5న రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి కబడ్డీ, క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
వేంకటేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబు
మండలంలోని మేడారం గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాల కోసం దేవాలయాన్ని విద్యుత దీపాలతో సుందరంగా అలంకరించారు. నిత్య పూజలు, భక్తుల సందడితో వెలుగొందుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తుల రాక నేపథ్యంలో నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అయిదు రోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాల వివరాలను దేవస్థాన కమిటీ చైర్మన ఎమ్. బిచ్యానాయక్ వెల్లడించారు. 5న డేరా కార్యక్రమం, 6న శ్రీ సీతారామ చంద్రస్వామి పూజా కార్యక్రమం, 8న కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
గోదాదేవిల సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
మండలంలోని కోదండపురం గ్రామంలో గల పద్మావతీ గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం రెండో తిరుపతిగా భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణరామానుజ చిన జీయర్‌స్వామి ఆలయాన్ని దర్శించి మంగళశాసనము చేసినటువంటి ఈ దేవాలయంలో 17న స్వామివారికి అధ్యయనోత్సవం, తొళ్లక్కంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 18న గరుడసేవ, పరమపదోత్సవము, 20న తేదీ తెల్లవారుజామున స్వామి వారి కల్యాణోత్సవం, 21న గజవాహనసేవ, రథోత్సవం, 22న శేషవాహన సేవ, 23న పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన గజ్జెల వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆలయ పూజారి కోమండురి శ్రీనివాసాచార్యులు, శ్రీకాంతచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన గజ్జెల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. జాతర సందర్భంగా కబడ్డీ, ఆర్కెసా్ట్ర, కోలాటం, భజనలు, అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - Feb 02 , 2025 | 01:19 AM