ఆ నలుగురికి డిపాజిట్లు కూడా దక్కవు
ABN, Publish Date - Feb 11 , 2025 | 12:31 AM
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన నలుగురు అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.
తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌కు మద్దతుగా భారీ ర్యాలీ
నల్లగొండ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన నలుగురు అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి పూల రవీందర్‌కు మద్దతుగా భారీ ర్యాలీతో నల్లగొండ కలెక్టరేట్‌కు సోమవారం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తీన్మా ర్ మల్లన్న మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లతో పూల రవీందర్ భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. ఉపాధ్యాయ ఓటర్లందరూ మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రస్తుతం పోటీచేస్తున్న అభ్యర్థి ఉపాధ్యాయ సంఘాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలు త్వరలో బయటపెడతానన్నారు. రిటైర్డు ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు టి.చిరంజీవులు మాట్లాడుతూ తమ ఫోరం పూల రవీందర్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి బీసీలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, బీసీల్లో రాజకీయంగా ఎదుగుతున్న వారిపై కుట్రలు చేస్తున్నారన్నారు.
ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించా : పూల రవీందర్
గతంలో తాను ఉపాధ్యాయ సమస్యల పరిష్కరించడం కోసమే పనిచేశానని ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలుకుని ప్రత్యేక రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించానన్నారు. పీఆర్టీయూకి తాను చేసిన సేవలను కొంతమంది గుర్తింపు లేకుండా చేశారని, తాను మాత్రం ఉపాధ్యాయుల మనస్సులో మాత్రం ఉన్నానన్నారు. తనకు జాక్టోత్‌తో పాటు 33 ఆధ్యాపక ఉపాధ్యా య సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, వివిధ కుల సంఘాలు అండగా ఉన్నాయన్నారు. ర్యాలీ సం దర్భంగా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేద్కర్, శ్రీకాంతాచారి విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాక్టోత్ చైర్మన్ సదానందా గౌడ్, నాయకులు కృష్ణుడు, చెన్నయ్య, బిక్షపతి, మట్టపల్లి రాధాకృష్ణ, భూతం యాకమల్లు, హరికృష్ణనాయక్, బొమ్ము నగే ష్, చక్రహరి రామరాజు, నకిరేకంటి కాశయ్య, బ్రిజేష్, హేమచంద్రుడు, జైబాబు, గీతాంజలి, విఠల్, యా దయ్య, దానయ్య, రాముడు, శ్రీనివాస్, రమేష్, సమీర్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 11 , 2025 | 12:31 AM