కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలం
ABN, Publish Date - Feb 18 , 2025 | 12:54 AM
ప్రాజెక్టులను నిర్మించి ఎత్తుపోతల పథకం ద్వారా రాష్ట్రాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాను మాజీ సీఎం కేసీఆర్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులను నిర్మించి ఎత్తుపోతల పథకం ద్వారా రాష్ట్రాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాను మాజీ సీఎం కేసీఆర్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వేడు కలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వేములవాడ దేవాలయంలో కేసీఆర్ పేరుతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. జిల్లా ప్రఽభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు బ్రెడ్, పండ్లును పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్, మహిళ విభాగం పట్టణ అధ్యక్షు రాలు బత్తుల వనజ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మినారాయణ, అర్బన్ బ్యాంక్ వైస్ చెర్మన్ ఆడగట్ల మురళి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, గ్రంథా లయం జిల్లా మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య పాల్గొన్నారు.
ఫ వేములవాడ: కేసీఆర్ జన్మదిన వేడుకలు వేములవాడలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సాయిరక్ష జంక్షన్ వద్ద మొక్కలు నాటి, రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు. పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీన రసింహారావు నివాసంలో పలువురు నాయకులు రక్తదానం చేశారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, పొలాస నరేందర్, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగం శంకర్, సిరిగిరి రామచందర్, నరాల శేఖర్, కొండ కనకయ్య, గుడిసె సదానందం, ముద్రకోల వెంకటేశం, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Feb 18 , 2025 | 12:54 AM