మహిళ పోలీసు పాత్ర కీలకం
ABN, Publish Date - Mar 08 , 2025 | 11:26 PM
పోలీసు శాఖలో మహిళా పోలీసు పాత్ర కీలకమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు మంచి ర్యాల డీసీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు.
- మంచిర్యాల డీసీపీ భాస్కర్
మంచిర్యాల క్రైం, మార్చి8 (ఆంరఽధజ్యోతి): పోలీసు శాఖలో మహిళా పోలీసు పాత్ర కీలకమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు మంచి ర్యాల డీసీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మహిళ అధికారులను, కానిస్టేబుళ్లను సన్మానించారు. అనంతరం కేక్‌కట్ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుశా ఖలో మహిళ పోలీసు పాత్ర కీలకమని, మంచిర్యాల జోన్ పరిధిలో పో లీసు అధికారులు, సిబ్బంది ఎంతో సమానంగా విధులు నిర్వహిస్తు న్నారన్నారు. మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని వారు ఏదైన సాధించగలరని అన్నారు. దేశంలో అన్ని రంగాల్లో పురుషులకంటే మ హిళలే మెరుగ్గా రాణిస్తున్నారన్నారు. పురుషుకంటే స్ర్తీలకు నిబద్ధత ఎ క్కువగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్ర మోద్‌రావు, మహిళ పోలీసు స్టేషన్ సీఐ నరేశ్, తాండూర్ కుమార స్వామి, మహిళ ఎస్‌ఐ హైమ, పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 11:26 PM