ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హమాలీ కార్మికుల రేట్ల జీవోను విడుదల చేయాలి

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:31 AM

హమాలీ కార్మికుల రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

నకిరేకల్‌లో గోదాం ఎదుట నినాదాలు చేస్తున్న హమాలీ కార్మికులు

నకిరేకల్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): హమాలీ కార్మికుల రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కార్మికులకు పెరిగిన రేట్లను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర సరఫరాల రేట్ల ఒప్పందం కాలపరమితి ముగిసి సంవత్సరం దాటి పోయిందన్నారు. గత సంవత్సరం అక్టోబరు నెలలో పౌర సరఫరాల అధికారులకు యూనియన్‌ నాయకులకు మధ్య చర్చలు జరిగి రేట్లు పెంచాలని నిర్ణయించినప్పకీ ఇప్పటి వరకూ జీవో విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ హమాలీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి దొనకొండ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, గోదాం మేస్త్రీ భద్రయ్య, కార్మికులు అశోక్‌, శ్రీనివాస్‌, పరమేష్‌, ముత్తయ్య, రవి, బాలస్వామి, సైదులు పాల్గొన్నారు.

నల్లగొండ రూరల్‌, (ఆంధ్రజ్యోతి): సివిల్‌ సప్లయ్‌ కార్మికుల మధ్య జరిగిన ఒప్పదం ప్రకారం పెరిగిన ధర జీవోను విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్‌చేశారు. హమాలీల సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఎగుమతి, దిగుమతి రేట్లను రూ.26 నుంచి రూ.29 వరకు పెంచినా జీవోను నేటీకి విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌ సరుకులు సకాలంలో గోదాముల నుంచి అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్‌ రెడ్డి, దొనకొండ వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, నాగరాజు, జానయ్య, శివ పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 12:31 AM