ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
ABN, Publish Date - Jan 31 , 2025 | 11:46 PM
లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్ 2020లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్ 2020లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 20లోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. అలాగే మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని, తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి డంపింగ్‌యార్డులకు తరలించాలన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో రూ. 10 లక్షలతో చేపట్టిన కంపోస్టుషెడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని వార్డుల్లో తాగునీటి సరఫరా ప్రతి రోజు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ భూముల ఆక్రమణ, సరైన అనుమతులు లేని నిర్మాణాలపై నిబందనల పరకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 31 , 2025 | 11:46 PM