చెరువులు నిండుగా.. పైరు పచ్చగా
ABN, Publish Date - Mar 04 , 2025 | 12:26 AM
వేసవికాలం మొదలైనప్పటికీ మండలంలోని వివిధ గ్రామాలు చెరువులు ఇప్పటికీ అలుగు పోస్తున్నాయి.
వేసవిలోనూ చెరువులకు జలకళ
గ్రామాల్లో అలుగు పోస్తోన్న చెరువులు
లో లెవెల్ కెనాల్ ద్వారా చేరుతున్న నీరు
చెరువుల కింద భూములు సస్యశ్యామలం
సాగు, తాగునీటి కష్టాలకు చెక్
నిడమనూరు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): వేసవికాలం మొదలైనప్పటికీ మండలంలోని వివిధ గ్రామాలు చెరువులు ఇప్పటికీ అలుగు పోస్తున్నాయి. మండలంలో ఆయకట్టు, నాన్ ఆయకట్టు గ్రామాల్లో ఐబీ పరిధిలో 23చెరువులు ఉన్నాయి. చెరువులన్నీ పూర్తిస్థాయిలో నీటితో నిండి ఉన్నాయి. రెండేళ్లుగా సరైన వర్షాలు లేనందున ఎండిన చెరువులు ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు పూర్తిస్థాయిలో నీటితో నిండాయి. దీనికితోడు నాగార్జునసాగర్, లో లెవెల్ కెనాల్(ఎల్‌ఎల్‌సీ) నీటితో చెరువులు నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వరదకాల్వ నీటితో నాన్ ఆయకట్టు గ్రామాల్లోని చెరువులు కూడా నిండి ఉన్నాయి. ఎల్‌ఎల్‌సీ ద్వారా చెరువులకు నీరు వచ్చి చేరుతుండటంతో నాన్ ఆయకట్టు గ్రామాలైన ముప్పా రం, సోమారిగూడెం, ఊట్కూరు, మార్పాక తదితర గ్రామాల చెరువులు నిండాయి. దీంతో రెండేళ్ల తర్వాత మండలంలోని చెరువులకు జలకళ సంతరించుకుంది. గొలుసుకట్టు చెరువులు కావడంతో దాదాపుగా అన్ని చెరువులు నిండి ఉన్నాయి. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెరువు తెగిపోవడంతో సకాలంలో మరమ్మతులు చేయనందున ఎండిపోయిన వెంగన్నగూడెం చెరువుకు ఎట్టకేలకు ఈ ఏడాది మరమ్మతులు చేయడంతో అది కూడా నీటితో కళకళలాడుతోంది. వెంగన్నగూడెం చె రువుకు నాగార్జునసాగర్ కాల్వ ద్వారా నీరు చేరుతుంది. వేసవికాలం మొదలవుతున్నా నిడమనూరు, తుమ్మడం, ముప్పా రం చెరువులు అలుగు పోస్తున్నాయి. తుమ్మడం చిన్నచెరువు అలుగు ఎత్తిపోతలను తలపి స్తోంది. చెరువులు నిండుగా ఉం డడంతో ఈ ఏడాది చెరువుల కింద వానాకాలం, యాసంగి సీజన్‌లలో గతంలో ఎన్నడూ లేని విఽ దంగా పంటలు సాగు చేయడం తో చెరువుల కింద పంట భూ ములు సస్యశ్యామలమయ్యాయి. గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య కూడా తలెత్తే అవకాశం లేదని, వచ్చే సీజన్‌లో సాగు నీటికి కూడా ఇబ్బంది లేదని రైతులు ఆనందంతో ఉన్నారు.
ఆనందంగా ఉంది
ఈ ఏడాది మా ఊరి చెరువు నిండటం ఆనందంగా ఉంది. రెండేళ్లుగా చెరువులో నీళ్లు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాము. కానీ ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాలతో చెరువు నిండగా, ఇప్పటికీ లో లెవెల్ కెనాల్ ద్వారా నీరు వస్తుండంతో చెరువు అలుగు పోస్తుంది.
కంచి శ్రీనివాస్, ముప్పారం.
అన్ని చెరువులు నిండుగా ఉన్నాయి
మండలంలోని అన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు ఎల్‌ఎల్‌సీ ద్వారా అనేక గ్రామాల చె రువులకు ఇప్పటికీ నీరు చేరుతోంది. చెరువులు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ఈ వేసవిలో ఎలాంటి నీటి సమస్య ఉండదు. చెరువులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం.
ప్రవీణ్‌రాజ్, ఐబీ ఏఈ
Updated Date - Mar 04 , 2025 | 12:26 AM