పాలకుల నిర్లక్ష్యమే ఎస్‌ఎల్‌బీసీకి శాపం
ABN, Publish Date - Feb 28 , 2025 | 12:30 AM
పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీరందించే ఎస్‌ఎల్‌బీసీకి శాపంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నా రు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీరందించే ఎస్‌ఎల్‌బీసీకి శాపంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నా రు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫ్లోరైడ్ కారణంగా అనేక ఇబ్బందులకు గుర వుతున్న నల్లగొండ జిల్లాలో 550గ్రామాలకు పైగా ప్రజలకు తాగునీరు, 4.30లక్షల ఎకరాలకు వ్యవసాయ భూములకు సాగునీరు అందే విధంగా ఉద్దేశించిన ఎస్‌ఎల్‌బీసీ సకాలంలో నిధులు విడుదల చేయక, కొన్నేళ్లుగా పట్టించుకోక పో వడంతో జిల్లా ప్రజలకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఎస్‌ఎల్‌బీసీని అవహేళన చేసి మాట్లాడిందన్నారు. కేసీఆర్ పాలనలో పదేళ్లపాటు ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. దీంతో టన్నెల్ పనులకు గ్రహణం పట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ప్రారంభించేందుకు ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేసి నా అధికారులకు ముందుచూపు కొరవడడంతో ప్రమాదం సంభవించిందన్నారు. ముందుగా నీటి ఊటను అంచనా వేయకపోవడం, చాలాకాలంగా పనులు చేయకపోవడం వల్ల భూమి పొరల సామర్థ్యం క్షీణించడాన్ని పరీక్షించకపోవడంతో ప్రాణ నష్టానికి దారితీసే పరిస్థితులు తలెత్తాయన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి ఉన్నారు.
Updated Date - Feb 28 , 2025 | 12:30 AM