ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతరొస్తుంది.. పనుల జాడేది?

ABN, Publish Date - Mar 06 , 2025 | 11:21 PM

చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్ల పాలకులు మారినా దేవాలయాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆ కోవకే చెందినది దేవరుప్పుల మండ లం కడవెండి శివారు పొట్టిగుట్టతండా జీపీ పరిధిలో ఉన్న వానకొండయ్యగుట్ట.

వానకొండయ్య గుట్ట

హోలీ నుంచి జాతర ఆరంభం..

అభివృద్ధికి నోచుకోని వానకొండయ్య గుట్ట

ఏళ్ల నుంచి పట్టించుకోని పాలకులు

సీసీ వేయకపోవటంతో రాకపోకలకు ఇబ్బందులు

ఏటేటా భక్తులు పెరుగుతున్నా .. ప్రగతి శూన్యం

పాలకుర్తి ఎమ్మెల్యే పట్టించుకోవాలని వినతి

దేవరుప్పుల, మార్చి 6(ఆంధ్రజ్యోతి): చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్ల పాలకులు మారినా దేవాలయాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆ కోవకే చెందినది దేవరుప్పుల మండ లం కడవెండి శివారు పొట్టిగుట్టతండా జీపీ పరిధిలో ఉన్న వానకొండయ్యగుట్ట. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా గుట్టపై వెలిసిన వానకొండయ్య లక్ష్మీన రసింహాస్వామి ఆలయం అభివృద్ధికి నోచకోవడం లేదని భక్తు లు మండిపడుతున్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ ప్రభు త్వ హయాంలో అప్పటి పాలకుర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గత మూడేళ్ల క్రితం గుట్ట అభివృద్ధికి కొంత చొరవ చూపారు. గుట్టపైన వెడల్పు చేయటం, గుడి గోపుర నిర్మాణం, గుట్ట కింద కల్యాణమండపం, గుట్టపైకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా దారి నిర్మిస్తానని హామీ ఇచ్చా రు. సుమారు రూ.2.50కోట్లు మంత్రి ప్రత్యేక నిధులు, రూ.50 లక్షలు దేవాదాయశాఖ ద్వారా మంజూరయ్యాయి. వాటితో గు ట్టపైకి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎక్స్‌కవేటర్ల ద్వారా గుట్టపైకి దారి చేయించి టిప్పర్లతో మొరం పోయించి వాహనాలు వెళ్లేలా మట్టి రోడ్డు పనులు రెండేళ్ల క్రితం రూ. 80లక్షల నుంచి రూ.కోటి వరకు వ్యయం చేశారు. ఆ ఏడాది జరిగిన జాతరకు అప్పటి మంత్రి ఎర్రబెల్లి గుట్టపైకి తన వాహనంలో వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గుట్ట నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో గుట్ట పై వేసిన మట్టి రోడ్డుపై సీసీ వేయ క పోవటంతో పిచ్చి చెట్లు మొలిచా యి. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు కాస్త రోడ్డు కయ్యలు కోసింది. రూ.కోటి వ్యయం చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రత్యే క చొరవ చూపి వానకొండయ్య లక్ష్మీనర సింహాస్వామి గుట్టను అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

హోలి పండుగతో జాతర షురూ..

హోలీ పర్వదినంతో వానకొండయ్య లక్ష్మీనరసింహాస్వామి జాతర వైభవంగా ఆరంభం కానుంది. ఉగాది వరకు అట్టహా సంగా సాగుతుంది. స్వామివారిని దర్శించుకు నేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. చుట్టూ గట్ట.. పచ్చని పొలాలు.. అరుదైన వృక్షాలతో ప్రకృతి ఒడిలోఓలలాడుతున్న ఆలయానికి వచ్చేందుకు భక్తులు ఉత్సాహం చూపుతుంటారు. దాంతో ఏటాఏటా భక్తులు సంఖ్య పరుగుతోం ది. జాతరకు ఇంకా పది రోజులే గుడు వు ఉన్నా అభివృద్ధిపై పాలకులు, అధికా రులు దృష్టి సారించకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎమ్మెల్యే కేటాయించిన నిధులతోపాటు, ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తన నిధులు సైతం విడుదల చేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టి యుద్ధప్రాతిపదిక పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. గుట్టపైకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా శాశ్వత పనులు చేపట్టాలని పేర్కొంటున్నారు.

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా...

-బెత్లీనారెడ్డి, మాజీ సర్పంచ్‌, కడవెండి

వానకొండయ్య గుట్ట అభివృద్ధి విషయమై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి దృష్టికి తీసుకెళ్తా. వందల ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీన రసింహుడు ఇక్కడి గిరిజన ప్రజల ఇలవేల్పు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం కడవెండి హన్‌మాన్‌ ఆలయం నుంచే స్వామివారి ప్రతిమతో పాటు తలంబ్రాలు ఊరేగింపు బయలు దేరుతున్నది. ఎమ్మెల్యేతో మాట్లాడి గుట్టను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తా.

ఎమ్మెల్యే చొరవ చూపాలి..

-దుబ్బాక కవిత, మాజీ ఎంపీటీసీ, కడవెండి

సాయుధ పోరాట యోధుల పురిటిగడ్డపై వెలసిన వాన కొండయ్య శ్రీ లక్ష్మీ నరిసింహ స్వామి వారి జాతర తాత, ముత్తాతల కాలం నుంచి కొనసాగుతున్నది. గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పటి పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక దృష్టి సారించడం వల్లే గుట్టపైకి మట్టి రోడ్డు వేయించారు. చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి. గుట్ట అభివృద్ధి విషయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి చొరవ చూపాలి.

Updated Date - Mar 06 , 2025 | 11:22 PM