ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరనున్న లోవోల్టేజీ సమస్య

ABN, Publish Date - Jan 01 , 2025 | 12:25 AM

మిర్యాలగూడ డివిజనలో లోవోల్టేజీ ప్రాంతాలను గుర్తించి సమస్య పరి ష్కారానికి అధికారులు చేపట్టారు. అందు లో భాగంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సీఎండీ కార్యాలయానికి నివేదించారు. దీంతో నిధులు మంజూరు కావ డంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

(మిర్యాలగూడ అర్బన -ఆంధ్రజ్యోతి)

2024-25 వార్షిక విద్యుత బడ్జెట్‌లో మిర్యాలగూడ డివి జనకు రూ.39 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో సబ్‌ స్టేషనకు రూ. 3 కోట్లు విడుదల కావడం, టెండర్‌ ప్రక్రి య పూర్తి కావడంతో పనులు సైతం మొదలుపెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తిచేసి విని యో గంలోకి తీసుకురావాలన్న దృఢసంకల్పంతో అధికా రులున్నారు. మిర్యాలగూడ డివిజనలో ఇప్పటికే 54 విద్యుత సబ్‌స్టేషన్లు ఉండగా 2,62,631 కనెక్షన్లు ఉన్నా యి. వీటితోపాటు ప్రతినెలా కొత్తగా విద్యుత కనెక్షన్లు పెరుగు తుం డడంతో లో వోల్టేజీ సమస్య తలెత్తుతోంది. దీన్ని పరిష్కరించేందుకు ట్రాన్సకో అధికారులు క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేసి 13 చోట్ల కొత్తగా సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

సబ్‌ స్టేషన్లు ఎక్కడెక్కడ అంటే..

మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల పరిధిలోని మిర్యాలగూడ, మిర్యాలగూడ రూరల్‌, బొమ్మకల్లు, తిమ్మారెడ్డిగూడెం, యాద్గార్‌పల్లి, రాయిని పా లెం, వాచ్యాతండా, తుంగపాడు, వాల్యాతండా, ఎర్ర బెల్లి, వేంపాడు, నాయ కునితండా, కుంకుడుచెట్టుతండా గ్రా మాల పరిధిలో సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు గత నెలలోనే ప్రారంభించారు. ఇవి వినియోగంలోకి వస్తే పల్లెప్రాం తాల్లో గృహ, వ్యవసాయానికి అంతరాయం ఏర్పడ కుం డా నిర్విరామంగా నాణ్యమైన విద్యుత సరఫరా జరిగే అవకాశం ఉంది.

మిర్యాలగూడలో స్థలా భావం

పల్లెల్లో సబ్‌ స్టేషన్ల నిర్మాణాలకు అవసరమైన స్థలా న్ని అధికారులు సేకరించి మార్కింగ్‌ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణ పనులు మొదలవుతుండగా, మిర్యాలగూడ పట్టణానికి మంజూరైన సబ్‌స్టేషన నిర్మాణంలో స్థలభావం నెలకొంది. పట్టణంలో ఇప్పటికే ఐదు సబ్‌స్టేషన్ల ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రమలకు విద్యుత సరఫరా జరుగుతోంది. అయితే ప్రస్తుతం వినియోగంలో ఉన్న సబ్‌స్టేషన్లపై విద్యుత లోడ్‌ అధిక మైన నేపథ్యంలో సరఫరాలో అవాంతరాలు ఎదుర వుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే మరో కొత్త సబ్‌స్టేషన నిర్మించడమే సరైన మార్గంగా అధి కారులు భావించి గతేడాది ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు.

దీంతో పట్టణ నడి బొడ్డున ఖాళీగా ఉన్న ఎన్నెస్పీ స్థలంలో 30 గుంటల భూమిని సబ్‌స్టేషన నిర్మాణం కోసం కేటాయించాలని కోరుతూ అధికారులు 4 క్రితం కలెక్టర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే, ఎనఎస్పీ అధికారులకు లేఖ రాశారు. ఈ ప్రదేశంలో సబ్‌స్టేషన ఏర్పాటు అన్ని విధాలా అనువుగా ఉండడంతో ఎనఎస్పీ క్యాంపు స్థలాన్ని అధికారులు ఎంచుకున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు ఎనఎీస్పీ స్థల కేటాయింపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థల కేటాయింపు విషయంలో స్పష్టత లేక సబ్‌స్టేషన నిర్మాణ పనుల్లో కొద్ది నెలలుగా జాప్యత కలుగుతోంది. స్థల కేటాయింపు విషయంలో జిల్లా మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపాలని వినియోగదారులు కోరుతున్నారు.

Updated Date - Jan 01 , 2025 | 12:25 AM