ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుదీక్షను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Feb 16 , 2025 | 11:41 PM

ఆమనగల్లు పట్టణంలో ఈనెల 18న బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టే రైతుదీక్షను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కోరారు.

సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, నాయకులు

- మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

వెల్దండ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : ఆమనగల్లు పట్టణంలో ఈనెల 18న బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టే రైతుదీక్షను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో రైతుదీక్ష సన్నాహక సమావేశంలో భాగంగా మండలస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ హామీలను అమలుచేయడంలో విఫలమయ్యిందని విమర్శించారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుపుతూ ఆరుగ్యారంటీలను పక్కదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులపక్షాన నిర్వహించే రైతుదీక్షకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరుకానున్నారని తెలిపారు. మండలంలోని అన్నిగ్రామాలనుండి రైతులు, పార్టీశ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని జైపాల్‌యాదవ్‌ కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ వెంకటయ్యగౌడ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ శేఖర్‌, నాయకులు చల్ల మధు సూదన్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, రాములు, భాస్కర్‌రావు, హన్మంతునాయక్‌, నిరంజన్‌, ఆనంద్‌, కొండల్‌యాదవ్‌, అంజినాయక్‌, అశోక్‌, రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

రైతు దీక్షకు కేటీఆర్‌ రాక

- బీఆర్‌ఎస్వీ కల్వకుర్తి అధ్యక్షుడు గణేష్‌

కల్వకుర్తి : ఈనెల 18న ఆమన్‌గల్‌ పట్ట ణంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యఅతిథులుగా హాజరవుతున్న రైతు దీక్షను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్వీ కల్వకుర్తి అధ్యక్షుడు దారమోని గణేష్‌ అన్నారు. ఈ సం దర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మా ట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలను కైవసం చేసుకో వాలని, దానికోసం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్య కర్తలు ముందుకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకులు రమేష్‌గౌడ్‌, శేఖర్‌, కృష్ణ, శ్రీనునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 11:41 PM