ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాల్వ పారదు.. మడి తడవదు!

ABN, Publish Date - Feb 21 , 2025 | 11:51 PM

పర్యాటకంగా సరికొత్త అందాలను సంతరించుకుంటున్న లక్న వరం చెరువు ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తోంది కానీ.. నమ్ముకున్న రైతులకు మాత్రం ఆనందం కరువుతోంది. ఈ చెరువు నుంచి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందరి పరిస్థితి ఉంది. ఏళ్ల కాలంగా తూముల లీకేజీలు వెంటాడుతుండగా విలువైన జలాలు వృథాగా పోతున్నా యి.

లక్నవరం తూములకు మరమ్మతు చేస్తున్న కార్మికులు(ఫైల్‌)

లక్నవరం ఆధునికీకరణకు మోక్షమెప్పుడో?

లీకేజీలతో వృథాగా పోతున్న జలాలు

పంట కాల్వలకు భారీగా గండ్లు

పేరుకుపోయిన పూడిక, పిచ్చిమొక్కలు

ఏటా ఎండుతున్న చివరి ఆయకట్టు

రూ.300 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు

నిధుల కేటాయింపులో జాప్యం

గోవిందరావుపేట, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): పర్యాటకంగా సరికొత్త అందాలను సంతరించుకుంటున్న లక్న వరం చెరువు ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తోంది కానీ.. నమ్ముకున్న రైతులకు మాత్రం ఆనందం కరువుతోంది. ఈ చెరువు నుంచి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందరి పరిస్థితి ఉంది. ఏళ్ల కాలంగా తూముల లీకేజీలు వెంటాడుతుండగా విలువైన జలాలు వృథాగా పోతున్నా యి. పంటకాల్వలు తెగి జల్లెడలా మార డంతో చివరి ఆయకట్టుకు నీరందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తూముల మరమ్మతు, కాల్వల ఆధునీక రణ కోసం నీటిపారుదల శాఖ ప్రభు త్వానికి సమర్పించిన ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు.

కాకతీయ రాజులు 800 ఏళ్ల క్రితం లక్నవరం చెరువును 5,555 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారు. ముందుచూపుతో వ్యవహరించి స్థానికంగా వర్షాభా వ పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వరద లక్నవరం సరస్సులోకి చేరే లా ఏర్పాట్లు చేశారు. సరస్సు నీటి నిల్వ సామర్థ్యం 2.1 టీఎంసీ లు. ఆయ కట్టులో అధికారికంగా 8,794 ఎకరాలు, అనధికారికంగా మరో 3వేల ఎకరాల భూములు సాగవుతు న్నాయి. అనాదిగా రైతులు ఇక్కడ వరిసాగే జీవనాధారంగా చేసుకున్నారు. ఆయకట్టు మొత్తానికి నీటి ని అందించేందుకోసం 80 కిలోమీ టర్ల మేర రంగాపూర్‌, కోట, శ్రీరాంపతి, నర్సింహు ల-1, నర్సింహుల-2 వంటి మొత్తం ఐదు కాల్వలను నిర్మించారు. ఖరీఫ్‌లో పూర్తి ఆయకట్టు సాగు లోకి వస్తుంది. రబీలో మాత్రం సరస్సులో నీటి మట్టానికి అనుగు ణంగా రొటేషన్‌ పద్దతిలో తైబందీని ప్రకటిస్తారు.

తూములు శిథిలం.. కాల్వలకు గండ్లు

నైజాం పాలనా కాలంలో చివరి సారిగా మరమ్మతు జరిగిన లక్నవ రం తూములు కాలక్రమంలో శిథిలమై పోయాయి. ఏటా వర్షాలు, వరదలకు కాల్వ లు కూడా ఎక్కడికక్కడ తెగిపోయాయి. చెరువులో పూడిక తీయకపోవడంతో సుమారు లక్ష క్యూబిక్‌ మీటర్ల మేర ఒం డ్రుమట్టి పేరుకుపోయింది. కాల్వలు కూడా గడ్డి, పిచ్చిమొక్కలతో పూడుకుపోయాయి. తూముల నుంచి భారీగా నీరు బయటకు వచ్చి సద్దిమడుగు గుండా కిందకు ప్రవహి స్తోంది. ఇలా ప్రతీ పంటకాలంలో 150 ఘనపుటడుగుల మేర నీరు వృథాగా పో తోంది. ఈ నీరు వెయ్యి ఎకరాలను సాగు లోకి తెస్తుందని అంచనా. సరస్సు నీటిమ ట్టానికి అనుగుణంగా ప్రకటించిన తైబందీ ప్రకారంగా రైతులు నాటు వేసుకుంటే లీకే జీలతో ముందే నీరు అడుగంటి చివరి ఆయకట్టుకు అందడంలేదు. దీంతో ప్రతీసా రి సుమారు వందల ఎకరాల వరిపంట ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. తూముల నుంచి విడుదల చేసిన నీటిని కాల్వలకు మళ్లించేందుకోసం సద్దిమడుగే ప్రధానం. బాలెన్స్డ్‌ రిజర్వాయర్‌గా పనిచేసే ఈ సద్దిమడుగు కూడా శిథిలమైపోయింది. 5ఎంసీఎఫ్‌టీ నీటినిల్వ సామర్థ్యం కలిగిన సద్దిమడుగు కట్టను బలోపేతం చేయడం తోపాటు షెట్టర్లను నిర్మించాల్సి ఉంది.

రూ.300 కోట్లతో ప్రతిపాదనలు..

తూముల లీకేజీలు, కాల్వలకు గండ్లతో పంటలు ఎండిపోతున్న తీరు, పెరుగుతున్న నష్టం దృష్ట్యా రైతుల డిమాండ్‌ మేరకు ములుగు జిల్లా నీటిపారు దల శాఖాధికారులు క్యాడ్‌వామ్‌(సీఎడీడబ్ల్యూఎం) పథకంలో భాగంగా 2017లో రూ.20కోట్లతో ప్రతిపా దనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఎటువంటి స్పందన కనిపించలేదు. ఏళ్లు గడుస్తు న్నా కొద్దీ కాల్వలు, తూములు ధ్వంసం కావడం, వ్యయం అంతకంతకూ పెరగడంతో రెండేళ్లక్రితం సమగ్ర సర్వే చేసిన అధికారులు రూ.300 కోట్లతో మరోసారి ప్రతిపాదనలు అందించారు. తూములకు స్కిన్‌వాల్‌ నిర్మించడంతోపాటు పంట కాల్వల్లో 80 కిలోమీటర్ల మేర గైడ్‌వాల్‌, వరద కాల్వలకు మత్త ళ్లు, డ్రైనేజీ, కట్టల బలోపేతం, దుంపెల్లిగూడెం నుం చి బుస్సాపురం మీదుగా రంగాపూర్‌ వరకు పంటకాల్వ పొడవునా రోడ్డు నిర్మాణం కోసం ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. సరస్సు వద్ద నిత్యం పర్యవేక్షణ కోసం 20మంది లష్కర్లతోపాటు మరో ఇద్దరు వాచ్‌మెన్‌లను నియమించాలని కూడా ప్రతిపాదించారు.

తూములకు తాత్కాలిక మరమ్మతులు

గతేడాది జూన్‌లో తూముల లోపల రాళ్లు కూలిపడ్డాయి. దీంతో నీళ్లు భారీగా లీకయ్యాయి. అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే రూ.22లక్షలతో తాత్కాలికంగా మరమ్మతు చేశారు. నైజాం కాలంలో అవలంభించిన పద్దతులను పాటిస్తూ డంగుసున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమాన్ని ఉపయోగించి రిపేర్‌ పనులు పూర్తిచేశారు. ఇందుకోసం చెరువులోని నీటినంతా బయటకు వదిలారు. ఈ చర్యలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ మళ్లీ రాళ్లు కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటు వ్యవసాయ పరంగా, అటు పర్యాటకంగా బహుళ ప్రయోజనకారిగా ఉన్న లక్నవరం చెరువును పరిరక్షించేందు కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.

వృథాను అరికడితే రెండు పంటలు

- శ్రీనివాస్‌, డీఈఈ

లక్నవరం చెరువు నీటి వృథాను పూర్తిస్థాయిలో అరికడితే ఆయకట్టులోని మొత్తం పొలాలలో ఏడాదికి రెండు పంటలు పండుతాయి. క్రితం ఏడాది తూముల లోపల మరమ్మతులు చేపట్టి కొంతమేరకు లీకేజీలను నిలువరించాం. రెండేళ్ల క్రితం రూ.300 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాం.

Updated Date - Feb 21 , 2025 | 11:51 PM