ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ట్రస్టు’ లేని ఆలయాలు!

ABN, Publish Date - Feb 09 , 2025 | 12:27 AM

ఆదాయం అసలే రాని, లేని ఆలయాలకు ధర్మకర్తలుగా పనిచేసేందుకు రాజకీయ నేత లు ఇష్టపడటం లేదు. చిన్న ఆలయాలను ఎవ రూ పట్టించుకోవడం లేదు. ఆదాయం లేని ఆలయాలకు ట్రస్టు ఏర్పాటుపై ఆసక్తి చూప డం లేదు. చిన్న ఆలయాల పాలక మండళ్ల నియామకం కోసం నల్లగొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నోటిఫికేషన జారీ చేశారు.

నార్కట్‌పల్లిలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం

‘ట్రస్టు’ లేని ఆలయాలు!

17 ఆలయాలకు నోటిఫికేషన జారీ

4 ఆలయాలకే వచ్చిన దరఖాస్తులు

రెండింటికే ట్రస్టుబోర్డు ఏర్పాటు

పాలక మండళ్లలో పదవులపై కనిపించని స్పందన

(ఆంధ్రజ్యోతి,నార్కట్‌పల్లి)

ఆదాయం అసలే రాని, లేని ఆలయాలకు ధర్మకర్తలుగా పనిచేసేందుకు రాజకీయ నేత లు ఇష్టపడటం లేదు. చిన్న ఆలయాలను ఎవ రూ పట్టించుకోవడం లేదు. ఆదాయం లేని ఆలయాలకు ట్రస్టు ఏర్పాటుపై ఆసక్తి చూప డం లేదు. చిన్న ఆలయాల పాలక మండళ్ల నియామకం కోసం నల్లగొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నోటిఫికేషన జారీ చేశారు. సుమారు 17 ఆలయాలకు నోటిఫికేషన జారీ చేసి మూడు నెలలు గడుస్తున్నా కేవలం 4 ఆలయాలకు మాత్రమే ధర్మకర్తలుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవడం ఇందుకు నిదర్శనం.

చిట్యాల మండలానికి చెందిన కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం (చిట్యాల), బాలలక్ష్మీనరసిం హస్వామి ఆలయం, సీతారామచంద్రస్వామి ఆ లయాలు(పేరేపల్లి), వేణుగోపాలస్వామి ఆల యం (వట్టిమర్తి), రామలింగేశ్వరస్వామి దేవాల యం (గుండ్రాంపల్లి) ఉన్నాయి. అదేవిధంగా క ట్టంగూరు మండలంలోని ఆంజనేయస్వామి దే వాలయం (ఈదులూరు), లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం (కట్టంగూరు), కేతేపల్లి మండలంలోని శివ మహాదేవ దేవాలయం (కాసనగో డు), వేంకటేశ్వరస్వామి ఆలయం (గుడివాడ), నకిరేకల్‌ మండలంలోని ఆంజనేయస్వామి దేవాలయం(మంగళపల్లి), శంభులింగేశ్వరస్వామి దే వాలయం (చందుపట్ల), లింగమంతులస్వామి దేవాలయం (నెల్లిబండ), గోరక్షక స్వామి దేవాలయం (గోరెంకలపల్లి), విరాట్‌ పో తులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆల యం (నకిరేకల్‌) ఉన్నాయి. అదేవిధంగా నార్కట్‌పల్లి మండలంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం(శాపల్లి), ఆంజనేయ స్వామి దేవాలయం (ఎల్లారెడ్డిగూడెం), వేణుగోపాలస్వామి దేవాలయం (నార్కట్‌పల్లి) ఉన్నాయి.

కేవలం 4 ఆలయాలకే దరఖాస్తులు

నలుగురు ధర్మకర్తలు ఒక ఎక్స్‌ అఫీషి యో సభ్యుడు కలిపి మొత్తం ఐదుగు రితో పాలక మండలిని నియమించనున్నా రు. నల్లగొండ జిల్లాలోని 6(సీ) కేటగిరీకి చెందిన 17 ఆలయాలకు గతేడాది అక్టోబ రు 9వ తేదీన ఎండోమెంట్‌ జిల్లా సహాయ కమిషనర్‌ నోటిఫికేషన జారీ చేశారు. వీటిలో అన్ని నకిరేకల్‌ నియోజకవర్గానికి చెందిన ఆలయాలే ఉండటం గమనార్హం. నోటిఫికేషన జారీ తేదీ నుంచి 20 రోజుల గడువు ఇచ్చారు. కానీ గ డువు ముగిసే నాటికి కేవలం 4 ఆలయాలకే పా లకమండలి కోసం దరఖాస్తులు వచ్చాయి. వీటి లో చిట్యాల మండలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం, బాలలక్ష్మీ నరసింహస్వామి ఆ లయం, రామలింగేశ్వర స్వామి ఆలయంతో పా టు నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం ఆంజనేయస్వామి ఆలయానికి మాత్రమే పాలక మండలి నియామక దరఖాస్తులు వచ్చినట్లు ఎండోమెంట్‌ అధికారులు తెలిపారు. వీటిలో చి ట్యాలలోని ఒక్క దేవాలయానికి మాత్రమే పాలకవర్గం ఏర్పాటైనట్లు దేవదాయశాఖ కార్యాలయ సెక్షన ఉద్యోగి తెలిపాడు. మిగతా మూడు ఆలయాల దరఖాస్తులు ఎండోమెంట్‌ పర్యవేక్షకురా లి పరిశీలనలోఉన్నట్లు తెలిపారు. చిన్న ఆలయా లకు ఆదాయం లేకపోవడమే ధర్మకర్తలు ముం దుకు రాకపోవడానికి కారణమని తెలుస్తుంది.

ఆలయాల అర్చకులకు వేతనం ఇవ్వాలి

భూములతో నిమిత్తం లేకుండా 6(సీ) కేటగిరీ కింద గుర్తించిన ఆలయాలన్నింటికి ప్రభుత్వం ఎండోమెంట్‌ ద్వారా దూపదీప నైవేద్యం తరహాలో రూ.10వేల గౌరవ వేతనం చెల్లించాలి. కొన్ని ఆలయాల్లో భూములకు వస్తున్న కౌలు ఆదాయం డీడీఎన కింద ఇచ్చే గౌరవ వేతనంలో సగం కూడా లేదు. ప్రభుత్వం ఈ వ్యత్యాసాన్ని గుర్తించి అర్చకునికి వేతనం ఇస్తే ఆలయాల నిర్వహణ, అభివృద్ధికి భక్తులు ముందుకు వస్తారు.

- దోసపాటి ప్రసాద్‌, భక్తుడు, నార్కట్‌పల్లి

ఒక్క దేవాలయానికే బోర్డు ఏర్పాటైంది

జిల్లాలోని నకిరేకల్‌ నియోజకవర్గ పరిధిలోని 6(సీ) కేటగిరీ గల 17 ఆలయాలకు ఇంతకుముందు సహాయ కమిషనర్‌ ఉన్న అధికారి నోటిఫికేషన జా రీ చేశారు. వీటిలో 13 ఆలయాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. కేవలం నాలుగు దేవాలయాలకు మాత్రమే పాలకమండలి సభ్యునిగా కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కేవలం చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి రామలింగేశ్వరస్వామి ఆలయానికి మాత్రమే కమిటీ ఆమోదం పొందింది. మిగతా 3 ఆలయాల దరఖాస్తులు పరిశీలన దశలోనే ఉన్నా యి.

- భాస్కర్‌, సహాయ కమిషనరు, నల్లగొండ

Updated Date - Feb 09 , 2025 | 12:27 AM